ఫరీద్ పేట్ లో సీఎం కప్ ను ప్రారంభించిన సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 22 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలోని పరిద్ పేట గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో సీఎం కప్ క్రీడలను స్థానిక సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ కోలా బాలా గౌడ్ లు గురువారం ప్రారంభించారు. పాఠశాలలో వాలీబాల్, కబడ్డీ, కోకో, ఇతర క్రీడలలో విద్యార్థులు పాల్గొన్న వారిని చేతిలో చేతులు వేసి కరచాలనం చేశారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామీణ విద్యార్థుల క్రీడలను వెలికి తీసేందుకు సీఎం కప్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు గ్రామీణ స్థాయి నుండి జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయ సిబ్బంది సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


