సౌత్ క్యాంపస్ ను సందర్శించిన తెలంగాణ యూనివర్సిటీ ఉపకులపతి ప్రో. యాదగిరిరావు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 22 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ ను ఉపకులపతి ప్రో. యాదగిరిరావు , రిజిస్ట్రార్ ప్రో. యాదగిరి తో కలిసి సందర్శించారు.
మహిళల హాస్టల్ లో పెండింగ్ పనులు పర్యవేక్షించారు. ఇంకా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పనులు పూర్తి చెయ్యాలని ఇంజనీర్ వినోద్ ను ఆదేశించారు. మహిళా హాస్టల్ సమస్యలను తన దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకురావాలని హాస్టల్ వార్డెన్ డా. సునీత కు తెలిపారు.
సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ డా.సుధాకర్ గౌడ్ తమ కు ఉన్న సమస్యలను ఉపకులపతి దృష్టికి తెచ్చారు.వెంటనే పరిష్కరిస్తామని VC, రిజిస్ట్రార్ లు తెలిపారు.
VC సందర్శన సమయంలో గర్ల్స్ హాస్టల్ వార్డెన్ డా.సునీత,బాయ్స్ హాస్టల్ వార్డెన్ డా.యాలాద్రి, డా.నారాయణ,apro డా. సరిత పిట్ల,అధ్యాపకులు డా.రమాదేవి,డా.నిరంజన్ శర్మ,దిలీప్,శ్రీకాంత్ విమెన్ సెల్ అసిస్టెంట్ డైరెక్టర్ వైశాలి, డా .శ్రీమాత,డా.పోతన్న,డా.ఇంద్రకరణ్,డా.కనకయ్య, డా.సునీల్ ,శ్రీనివాస్ , గర్ల్ హాస్టల్ కేర్ టేకర్ హారిక తదితరులు పాల్గొన్నారు.


