మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల అధికారుల పాత్ర కీలకం
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 23 (అఖండ భూమి న్యూస్);
మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించడంలో ఎన్నికల అధికారుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నియమించబడిన రిటర్నింగ్ అధికారులు (ఆర్ ఓ ఎస్), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు (ఏ ఆర్ ఓ ఎస్), ఎస్ ఎస్ టి, ఎస్ టి అధికారులకు నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.
నోటిఫికేషన్ జారీ అయిన దశ నుంచి ఫలితాల ప్రకటన వరకు ఎన్నికల నిర్వహణకు పూర్తి బాధ్యత రిటర్నింగ్ అధికారులదేనని కలెక్టర్ స్పష్టం చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను పకడ్బందీగా అమలు చేయడంలో ఎస్ ఎస్ టి, ఎఫ్ ఎస్ టి, వి వి టి బృందాల బాధ్యత కీలకమని తెలిపారు.
కామారెడ్డి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు – కామారెడ్డి, బిచ్కుంద, ఎల్లారెడ్డి, బాన్సువాడకు చెందిన అధికారులకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ శిక్షణలో మాస్టర్ ట్రైనర్లు తాడ్వాయి శ్రీనివాస్, నర్సింహులు, వెంకట్ లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నికల విధివిధానాలపై అవగాహన కల్పించారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ – (తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ చట్టం ప్రకారం)
పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులు/ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలో భద్రపరుస్తారు.
ఎన్నికల అధికారి (ఆర్ ఓ) ఆధ్వర్యంలో లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేస్తారు.
అభ్యర్థులు లేదా వారి లెక్కింపు ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
ముందుగా పోస్టల్ బ్యాలెట్లను (ఉండినచో) లెక్కిస్తారు.
అనంతరం బ్యాలెట్ పేపర్లు/ఈవీఎంల ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
చెల్లుబాటు అయ్యే ఓట్లు, చెల్లని ఓట్లు వేరు చేసి నమోదు చేస్తారు.
ప్రతి రౌండ్ ముగింపులో ఫలితాలను ఏజెంట్లకు తెలియజేస్తారు.
లెక్కింపు షీట్లను జాగ్రత్తగా నింపి ధృవీకరిస్తారు.
అత్యధిక ఓట్లు పొందిన అభ్యర్థిని విజేతగా గుర్తిస్తారు.
ఆర్వోఅధికారికంగా ఫలితాన్ని ప్రకటించి రిటర్నింగ్ సర్టిఫికెట్ జారీ చేస్తారు.
మున్సిపల్ ఎన్నికల్లో చెల్లని (Invalid) ఓట్లు నిర్ణయించే విధానం
ఒకటికంటే ఎక్కువ గుర్తులు వేస్తే ఆ ఓటు చెల్లదు.
ప్రిసైడింగ్ ఆఫీసర్ అధికారిక ముద్ర లేకపోతే ఓటు చెల్లదు.
బ్యాలెట్ పేపర్‌పై ఓటరు పేరు, సంతకం లేదా గుర్తింపు వ్రాసినట్లయితే ఓటు చెల్లదు.
ఓటరు ఉద్దేశం స్పష్టంగా తెలియని అస్పష్టమైన ముద్ర ఉంటే చెల్లదు.
తప్పు స్థానంలో ముద్ర వేస్తే ఓటు చెల్లదు.
చింపబడిన లేదా తీవ్రంగా దెబ్బతిన్న బ్యాలెట్ పేపర్ చెల్లదు.
ఒకే చిహ్నంపై రెండు సార్లు లేదా వేర్వేరు చోట్ల ముద్రలు ఉంటే చెల్లదు.
తుది నిర్ణయం RO/కౌంటింగ్ సూపర్వైజర్ ఎన్నికల నిబంధనల ప్రకారం తీసుకుంటారు.
ఏజెంట్ల అభ్యంతరాలు ఉంటే వాటిని నమోదు చేసి నిర్ణయం ప్రకటిస్తారు.
ఓటరు ఉద్దేశం స్పష్టంగా, ఎన్నికల నియమాలకు అనుగుణంగా ఉన్నప్పుడే ఓటు చెల్లుతుంది.
మున్సిపల్ వార్డ్ మెంబర్ ఎన్నికల వ్యయాలు – ముఖ్య నిబంధనలు
ప్రతి వార్డ్ మెంబర్ అభ్యర్థికి గరిష్ట వ్యయ పరిమితిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుంది.
నామినేషన్ దాఖలు చేసిన తేదీ నుంచి ఫలితాల ప్రకటన వరకు చేసిన ఖర్చులన్నీ వ్యయంగా పరిగణిస్తారు.
ప్రచారం, సభలు, బ్యానర్లు, పోస్టర్లు, వాహనాలు, మైక్‌లు తదితర ఖర్చులు వ్యయాల్లో చేరతాయి.
అభ్యర్థి స్వయంగా చేసిన ఖర్చులతో పాటు ఇతరులు చేసిన ఖర్చులు కూడా లెక్కలోకి వస్తాయి.
ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా ఎన్నికల వ్యయాల రిజిస్టర్ నిర్వహించాలి.
ఆర్వో నిర్దేశించిన తేదీల్లో ఖర్చుల వివరాలను సమర్పించాలి.
వ్యయాల పర్యవేక్షణకు ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఎక్స్‌పెండిచర్ ఆబ్జర్వర్లు ఉంటారు.
నిర్ణయించిన పరిమితిని మించి ఖర్చు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
వ్యయాల ఖాతాలు సమర్పించకపోతే లేదా తప్పుడు వివరాలు ఇస్తే అనర్హతకు అవకాశం ఉంటుంది.
ఎన్నికల నియమ నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ శిక్షణ లో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమొహాన్, deo రాజు, mc రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


