కామారెడ్డి జిల్లా కేంద్రంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 26 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం నాడు8వ వార్డు , హౌసింగ్ బోర్డ్ కాలనీలో జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం చేశారుఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కి చెందిన కామారెడ్డి బిచ్కుంద బాన్సువాడ ఎల్లారెడ్డి మున్సిపాలిటీలకు సంబంధించిన జనసైనికులు హాజరయ్యారు. 8వ వార్డు జనసేన పార్టీ అభ్యర్థి నర్సాగౌడ్ జనసేన పార్టీ నాయకులు నక్క మల్లేశం . దినేష్ జీవన్ నాయక్ శ్రీకాంత్ తోకలిసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సా గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీలో పోటీ చేస్తుందని జనసేన కార్యకర్తలు అభిమానులు సహకారంతో పోటీ చేస్తున్న వార్డుల్లో గెలుపు దిశగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు నక్క మల్లేశం జాజారీ దినేష్, మల్లేశం, జీవన్ నాయక్, శ్రీకాంత్, కోలా శరత్, లింగంపేట్ మల్లికార్జున్, బిచ్కుంద పవన్ కళ్యాణ్, సుభాష్, రాజ్ కుమార్ పలువురు పాల్గొన్నారు.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…


