*10 వేల మంది పోలీసులు.. 3 వేల సీసీటీవీ కెమెరాలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 26 (అఖండ భూమి న్యూస్);
గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. గణతంత్ర వేడుకలకు బహుళ అంచెల భద్రత ఏర్పాటు చేశారు. 10 వేల మంది పోలీసులతో పాటు ఈసారి ఆధునిక నిఘా సాధనాలను ఉపయోగిస్తున్నారు. ఏఐ ఆధారిత గాగుల్స్‌తో పాటు వేలాది సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు ఆదివారం అధికారులు తెలిపారు.
వేడుకల్లో పాల్గొనే అతిథులతో పాటు వీక్షకుల భద్రతకు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టామని అడిషనల్ పోలీస్ కమిషనర్ దేవేశ్ కుమార్ మహలా తెలిపారు. నగరంలో పలుచోట్ల పికెట్‌లు, బ్యారికేడ్ల ఏర్పాటుతో పాటు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు అమలు చేస్తున్నామన్నారు. 3 వేల సీసీటీవీ కెమెరాలను వీడియో అనలిటిక్స్, ముఖ గుర్తింపు వ్యవస్థలతో అనుసంధానం చేశామన్నారు. 30కి పైగా కంట్రోల్‌రూమ్‌ల్లో 150 మందికి పైగా సిబ్బంది నిరంతరం నిఘా వేస్తారని చెప్పారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


