*కామారెడ్డి నియోజకవర్గ పార్టీ ఆఫీసులో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు…
*టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 26 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి, జనవరి 26:
కామారెడ్డి నియోజకవర్గ పార్టీ ఆఫీస్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛలు కల్పించిందని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, దేశాభివృద్ధికి ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు, యువత, పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని, కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో,తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ ప్రియా, తాజా మాజీ కౌన్సిలర్లు, పంపరి శ్రీనివాస్, జూలూరి సుధాకర్, శంకర్రావు, తాటి ప్రసాద్,సాయిబాబా, సలీం, చాట్ల వంశీ, చేవెళ్ల రాజు, రంగ రమేష్ గౌడ్, మామిళ్ళ రమేష్, గడ్డం మీది మహేష్, నర్సుల మహేష్, మున్ను, పాల్గొన్నారు.


