సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 26(అఖండ భూమి న్యూస్):
కామారెడ్డి జిల్లా దోమకొండ సామాజిక 30 పడకల ఆరోగ్య కేంద్రంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. దోమకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సూపర్డెంట్ వెంకటేశ్వర్లు జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం దేశ స్వాతంత్ర్యానికి, రాజ్యాంగ విలువలకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి ప్రతినిత్యం వచ్చిన ప్రజలకు మరింత నిబద్ధతతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో దోమకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


