*ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు,..
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ విక్టర్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 26 (అఖండ భూమి న్యూస్);
77 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
వైద్య ఆరోగ్య శాఖ, అగ్నిమాపక శాఖల శకటాలను తిలకించిన అనంతరం వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా తెలియజేశారు.
వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి , వివిధ శాఖల లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంస పత్రాలను అందజేశారు.
అనంతరం శాఖల ప్రగతిపై ఏర్పాటుచేసిన స్టాళ్లను సందర్శించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్ మధుమోహన్, ఆర్డీవోలు పార్థ నరసింహా రెడ్డి, వీణ, ఆయా శాఖల జిల్లా అధికారులు , తదితరులు పాల్గొన్నారు.
అంతకు ముందు కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


