మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం వేడుకలు

పుల్లల చెరువు అఖండ భూమి జనవరి 26 న్యూస్
గణతంత్ర దినోత్సవము పురస్కరించుకొని ఈ రోజు పుల్లలచెరువు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణములో మండల అధ్యక్షులు కందుల వెంకటయ్య, ఎంపీడీవో. యం. మరియదాసు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాని ఆవిష్కరించారు
ఈ సందర్భంగా ఎంపీడీవో మరియదాసు మాట్లాడుతూ మనకు ఫ్రీడంమ్ వచ్చింది 1947లోనే.. కానీ 1950 వరకు మన దేశానికి సొంత రాజ్యాంగం లేదు.అప్పటివరకు మనం బ్రిటిష్ రాచరికం కింద నడిచే ఒక డొమినియన్ మాత్రమే..మన రాజ్యాంగం 1949 నవంబర్ 26 నాటికి సిద్దమై పోయినది.. కాని నాయకులు కావాలనే మరో రెండు నెలలు ఆగి జనవరి 26 వరకు వెయిట్ చేసినారు..ఎందుకు? దీని వెనక 1930 నాటి పూర్ణ స్వరాజ్ తీర్మానము మేరకు 1950 జనవరి 26 న అమలు లోనికి తెచ్చినారు. భారత రాజ్యాంగాన్ని రచించడానికి ఏర్పడిన,రాజ్యాంగ పరిషత్ యొక్క గొప్పతనం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగం రచించిన విధానం, మన దేశ స్వాతంత్ర సమరయోధుల గూర్చి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి విద్యార్థినులకు స్వీట్స్ పంచడం జరిగినది. ఈ కార్యక్రమంలో, ఎంపీపీ కందుల వెంకటయ్య, ఏ వో, మండల కన్వీనర్ పోట్ల గోవింద , మరియు ఉద్యోగస్తులు, విద్యార్థి విద్యార్థినులు, వివిధ శాఖల అధికారులు, పాల్గొన్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్


