నంద్యాల : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నేత నారా లోకేష్ కుడి చేతి భుజానికి మళ్లీ తీవ్రమైన నొప్పి ప్రారంభమైంది. వైద్యుల సూచన మేరకు ఆయన నంద్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కుడి చేతి భుజానికి స్కానింగ్ చేయించడం కోసం వెళ్లారు..కదిరిలో పాదయాత్ర చేస్తున్న సమయంలో ఫోటోలు దిగేందుకు అభిమానులు లోకేష్.. కుడి చేయి భుజాన్ని బలంగా లాగారు. దీంతో ఆయనకు భుజం నొప్పి ప్రారంభమైంది. నంద్యాల మ్యాగ్న ఎంఆర్ఐ సెంటర్‌లో నారా లోకేష్ కుడి భుజానికి ఏంఆర్ఐ స్కానింగ్ చేశారు. 50 రోజులుగా కుడి భుజం నొప్పితో లోకేష్ బాధపడుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించిన సందర్భంలో ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో కార్యకర్తల తోపులాట జరిగింది. ఈ సమయంలోనే సెల్ఫీ కోసం అభిమానులు ఆయన భుజాన్ని బలంగా లాగడంతో గాయమైంది. అప్పటి నుంచి నొప్పితో బాధపడుతూనే నారా లోకేష్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఫిజియథెరపీ, డాక్టర్ల సూచన మేరకు జాగ్రత్తలు తీసుకున్నా నొప్పి తగ్గడం లేదు. నంద్యాల పద్మావతి నగర్‌లో ఉన్న మ్యాగ్న ఎంఆర్ఐ సెంటర్‌కి నారా లోకేష్ చేరుకున్నారు..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


