పదవ తరగతి విద్యార్థులకు స్టడీ అవర్స్ లో అల్పాహారం అందజేసిన భాస్కర్ రావు

పుల్లల చెరువు అఖండ భూమి జనవరి 27 న్యూస్
పుల్లలచెరువు మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ప్రారంభమైన వందరోజుల స్టడీ అవర్స్ లు విద్యార్థులు కృషితో చదువుతూ జిల్లా పరిషత్ హై స్కూల్ కి మంచి పేరు తీసుకురావాలని పుల్లలచెరువుకి చెందిన పూర్వ జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివి వ్యాపారవేత్తగా నిలిచిన ఘననీయుడు గజ్వేలీ భాస్కరరావు వారి కుమారుడైన గజ్వలి శ్రీరామ్ చేతుల మీదుగా పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు సాయంత్రము టాయానా టిఫిన్, స్నాక్స్, ఎగ్ పఫ్ ,కర్రీ పఫ్, మంచి గొప్ప మనసుతో 120 మంది విద్యార్థులకు మంగళవారం నుంచి 15 రోజులు అందజేస్తామని వారు చెప్పడం జరిగినది. ముందుగా భాస్కర్ రావు కుమారుడు శ్రీరామ్ ను జిల్లా పరిషత్ హై స్కూల్ చైర్మన్ కొలుకులూరి కృష్ణయ్య, ప్రిన్సిపల్ ప్రభు జి, ఉపాధ్యాయులు, వేదిక పైన శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రభూజి మాట్లాడుతూ పూర్వ జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివి వ్యాపారవేత్తగా గజ్జలి భాస్కరరావు హరి కుమారుడైన శ్రీరాముకి ఇలాంటి మంచి ఆలోచన వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు . అలాగే ఎంతో పెద్ద మనసుతో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు కడుపు నింపే ఆలోచనాతో విద్యార్థులకి ఎగ్ పఫ్, పంచడం జరిగినది. ఈ సందర్భంగా గజ్వేల్ భాస్కరరావు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల క్రితం మేము ఇదే జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివాము అప్పటికీ ఇప్పటికీ ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ చాలా మారిపోయింది ఇంకా మార్పు రావాలని ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఎంతోమంది వివిధ ప్రాంతాల నుంచి పుల్లలచెరువులో ఉన్న స్కూలుకి వచ్చి చదువుతూ ఇంటిదగ్గర ఎన్ని కష్టాలు ఉన్నా క్రమం తప్పకుండా స్కూలుకు రోజు వచ్చి క్రమశిక్షణతో ఉపాధ్యాయులు చెప్పినట్టు చదువుతూ మన జిల్లా పరిషత్ హై స్కూల్ కి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు వివరించారు. అలాగే పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ సంవత్సరం ఎగ్జామ్స్ లో మార్కులు సాధించిన వారికి మంచిగా చదివి స్కూల్ పేరు నిలబెట్టేలా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థికి మొదటి బహుమతి కింద 5000 రూపాయలు అందజేస్తానని విద్యార్థుల్ని ప్రోత్సహించారు. అలాగే ఉపాధ్యాయులు చెప్పినట్టు క్రమశిక్షణతో విద్యాబోధన చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని పుల్లలచెరువు మండలానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు పలు సూచనలు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ హై స్కూల్ చైర్మన్ కొలుకులూరి కృష్ణయ్య, గజ్వలి భాస్కరరావు, గజ్వలి శ్రీరామ్, నీటి సంఘం అధ్యక్షులు కొలుకులూరి కుమార్, ప్రిన్సిపల్ ప్రభుజి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు…


