ఘనంగా కన్యాక పరమేశ్వరి ప్రథమ వార్షికోత్సవం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 28 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని స్థానిక నగరేశ్వర దేవాలయం లోని ప్రతిష్టించిన శ్రీ కన్యక పరమేశ్వరి ప్రథమ వార్షికోత్సవం ఉత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించినట్లు వాసవి క్లబ్ వైస్ గవర్నర్ బాశెట్టి నాగేశ్వర్ తెలిపారు. ఉదయం స్థానిక మార్కండేయ మందిర్ నుండి ఆర్యవైశ్యులు సతీ సమేతంగా ఊరేగింపు, పుణ్యవచనం, గణపతి పూజ, హోమం తీర్థ ప్రసాద వినియోగం నిర్వహించారు. ఆలయంలో ఉదయం నుండి భక్తుల సందడితో కిటకిటలాడింది. ఆలయం కు వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఆలయం కు ధ్వజస్తంభం, ఇత్తడి తొడుగు నిర్మాణం కు మాసానిపల్లి చంద్రకళ పెరమండ్లు సుమారు రెండు లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. వారి దంపతులను ఆలయ కమిటీ వారు శాలువలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్ సభ్యులందరూ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.


