*నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటాలు చేసే సిపిఎం అభ్యర్థులను గెలిపించండి…

సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 28 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా కేంద్రంలోనీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బుధవారం సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాదారు. కామారెడ్డి జిల్లా కేంద్రం మున్సిపాలిటీ లోని 7, 8, 27 వార్డుల్లో సిపిఎం పోటీ చేస్తుందని ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తున్న సిపిఎం అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నామని అన్నారు. ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పి అనేక హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత ఓటు వేసిన వారికి ముఖం కూడా చూపించకుండా తమ స్వలాభాల కోసం వ్యాపారాలు, కబ్జాలు, సెటిల్మెంట్ ల కోసం తిరిగే నాయకులకు ఓటు వేయవద్దని అన్నారు. ప్రజల కోసం కొట్లాడుతూ తప్పుడు కేసులు మీదేసుకొని లాఠీచార్జీలు, దెబ్బలు తిని జైలు కెళ్ళి తిరిగి మళ్లీ ప్రజల కోసం కొట్లాడుతున్న సిపిఎం అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని మీ ప్రాంతాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరుతున్నామని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వెంకట్ గౌడ్ , మోతిరామ్ నాయక్ ,కొత్త నరసింహులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


