పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న చాయ్ హోటళ్లు
* చాయ్ కొట్టులపై అధికారుల పర్యవేక్షణ లోపం..
* ప్రజల ఆరోగ్యానికి శాపo..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 28 (అఖండ భూమి న్యూస్);
పలు జిల్లాలో కెమికల్స్ తో చాయ్ దుకాణాలను నిర్వర్తిస్తున్నారు. వివిధ గ్రామాలకు చెందిన వ్యక్తులు బెల్లం చాయ్ కి బానిసలుగా మారారు. అయితే బెల్లం చాయిలో కెమికల్ వాడి చాయి నిర్వాహకులు ప్రజలను ఆకర్షణకు గురి చేస్తున్నారని పలువురు మేధావులు ఆరోపణ వ్యక్తం చేస్తున్నారు. బెల్లం చాయి తయారు చేయాలంటే పట్టిక బెల్లము పాలతో తయారు చేసినది ఆరోగ్యానికి మంచిది. కానీ నిర్వాహకులు పటిక బెల్లము పాలు కొనుగోలు చేయాలంటే అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టాలి ఆ పెట్టుబడికి చాయ్ ధరకు నిర్వాహకులకు నష్టమే కలుగుతుంది తప్ప లాభమేమి ఉండదని లాభం లేకుండా ఎవరు కూడా ఈ వ్యాపారం చేయలేరని అందుకే చాయ్ హోటల్ నిర్వాహకులు కెమికల్ కలిగిన బెల్లాన్ని పాల పౌడర్ ను పర్యవేక్షణ కొరకు ఎవరైనా వస్తే చూపించుకోవడానికి కొద్దిపాటి డైరీ పాల ప్యాకెట్లను కొనుగోలు చేసి కొట్టు నిర్వహిస్తున్నారని నిర్వాహకులకు లాభార్జన తప్ప ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాదని మండలానికి చెందిన వారు ఆరోపిస్తున్నారు. ప్రజల కొరకు హోటల్స్ ను నడిపించేవారు ఇలాంటి ఆకర్షితమైన హోటల్స్ ను నడపరని ఇలాంటి వాటిపై అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రజల ఆరోగ్యానికి శాపంగా చాయ్ హోటల్స్ మారాయని చాయ్ రుచికరంగా రావడానికి కెమికల్స్ తప్పనిసరిగా వాడుతున్నారని స్వచ్ఛమైన చాయ్ కి రుచి ఉండదని మండలం లో ప్రజలు చర్చించుకుంటున్నారు. మండలంలో ఏ దండనైనా మూడు పూలు ఆరు కాయలుగా మారాయని అది ప్రజల ఇబ్బంధులకు దారితీస్తుందని ప్రతి దానిపై అధికారుల పర్యవేక్షణ కరువైందని ఇకనైనా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తే బాగుంటుంది అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


