ఎప్పటికైనా మనిషికి చావు రాక తప్పదు….
అధర్మానికి చరిత్రలో చోటు లేదు….
సత్యం, ధర్మం, న్యాయం మన నినాదం కావాలి….
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; ఫిబ్రవరి 01.
(అఖండభూమి న్యూస్):
దేశ, రాష్ట్రా , పాలించే స్థాయి వ్యక్తి మొదలుకొని మామూలు ఉద్యోగి వరకు అందరూ వృత్తి ధర్మం తప్పక పాటించాలి. మనిషికి ఎప్పటికైనా చావు రాక తప్పదు అనేది జగమెరిగిన సత్యం. మనిషి బ్రతికిన విధానమే అతడిని చరిత్రలో ఆదర్శంగా నిలిపేదా, అపకీర్తిగా మిగిల్స్తదా అనేది నిర్ణయిస్తుంది. శాశ్వతం కానీ ఈ జీవన ప్రయాణంలో శాశ్వత గమ్యం కోసం అక్రమ ఆస్తులు కూడబెట్టడం మనిషి చేసే అతిపెద్ద తప్పు. అది సంపాదన కాదు, అది స్వయం నాశనానికి చేసుకునే పునాది అనేది గుర్తుంచుకోవాలి. వేమన చెప్పిన మాటలు నేటికీ అక్షర సత్యమే. ధర్మం లేని ధనం, చివరకు చేతికి రాకుండా చెడిపోతుంది అని ఆయన ఆనాడే చెప్పారు. ధర్మం లేని సంపాదన మనిషిని దౌర్భాగ్య జీవితం వైపు నడిపిస్తుంది. అక్రమ సంపాదన చివరకు చావుకు మార్గం అవుతుంది. ఆ ధర్మంతో నడిచిన జీవితం ఒకరోజు తప్పకుండా పతనాన్ని చవిచూస్తుంది. మన పాపాలే మన ఆరోగ్యాలను నాశనం చేస్తాయనేది గుర్తుంచుకోవాలి. కాలమే ఎన్నోసార్లు నిరూపించిన విషయాన్ని మర్చిపోవద్దు. ప్రజలను కొల్లగొట్టి, దోపిడీ చేసి సంపాదించిన ఆస్తులు మనసుకు ప్రశాంతత ఇవ్వవు, నిద్రను సైతం ఇవ్వకుండా, ఆనందాన్ని దూరం చేస్తాయి. శ్రీ శ్రీ అన్న మాటలు నేటి సమాజానికి ఒక గుణపాఠం. మానవత్వం లేని సంపద మూర్తి కన్నా భయంకరం. కులం ఏదైనా కావచ్చు, మొత్తం ఏదైనా కావచ్చు కానీ పాటించాల్సిన ధర్మం మాత్రం ఒక్కటే అని విషయాన్ని మర్చిపోవద్దు. సత్యం, ధర్మం, న్యాయం ఇది కేవలం నినాదాలు కావు అవి ప్రతి వృత్తికి శాశ్వత భద్రత కవచంలా ఉంటాయి. ముఖ్యమంత్రి నుండి కార్పొరేట్, ఐపీఎస్ నుండి బిల్ కలెక్టర్, జర్నలిస్టు నుండి కూలి వారి వరకు అందరికీ ధర్మం ఒకటే, అధర్మానికి ఎక్కడ మినహాయింపులు లేవు. అక్రమాలతో, దోపిడీలతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన ఆస్తులు జిల్లాలుగా కనిపించవచ్చు, విలాసంగా అనిపించవచ్చు కానీ అవి మనసుకు నిద్ర ఇవ్వవు. కుటుంబానికి ప్రశాంతత ఇవ్వవు, జీవితాన్ని భయంగా మారుస్తాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చివరి క్షణంలో నా వెంట ఏమీ తీసుకువెళ్లను అనే ప్రశ్నకు అక్రమ సంపాదన దగ్గర సమాధానం ఉండదు. అక్రమాస్తులు కూడా పెట్టిన వారి చావు కూడా చరిత్రలో భయంకరంగానే నమోదవుతుంది. ధర్మంగా బతికిన వారే చరిత్రలో చిరస్థాయిగా పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. ఈరోజు ముఖ్యమంత్రి నుండి ఎమ్మెల్సీ వరకు ఏ ప్రజా ప్రతినిధి అయిన అన్యాయం, అక్రమం, దోపిడీకి దూరంగా బ్రతికితే ఆ పేరు శాశ్వతంగా చరిత్రలో నిలుస్తుంది. తాత వంటి మహానుభావులు ధర్మం, సత్యం, న్యాయంతో సంపాదనను సేవగా మార్చారు అనేది మనం గుర్తుంచుకోవాలి. అందుకే వారి పేరు ఈరోజు సువర్ణ అక్షరాలతో చరిత్రలో నిలిచిపోతుంది. పదవులు తాత్కాలికం, అధికారం తాత్కాలికం కానీ ధర్మం మాత్రం ఎప్పటికీ శాశ్వతమే. నిజాన్ని రాసిన దెబ్బలు నోరు మూయించవచ్చు కానీ నిజాన్ని మాత్రం ముగించలేం. సత్యం ఆలస్యం అవుతుంది కానీ ఎప్పటికైనా బయటికి వస్తుంది. ఆస్తులు ముఖ్యం కాదు, అంతస్తులు ముఖ్యం కాదు, జీవితానికి కావలసింది ప్రశాంతత అనే విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోవద్దు. ధనికుడు, పేదవాడు అనే తేడా లేకుండా సత్యం అందరికీ ఒకేలా ఉంటుంది. అందరికీ శిక్ష కూడా ఒకేలాగా ఉంటుంది. మనిషి శాశ్వతం కాదు కానీ మనిషి చేసిన పనులే శాశ్వతంగా చరిత్రలో నిలుస్తాయి. ఇది హెచ్చరిక కాదు సమాజానికి ఇచ్చే గుణపాఠం. సత్యం, ధర్మం, న్యాయంతో పని చేస్తే సాక్షాత్తు దేవుడే ఆశిస్సులు ఇస్తారు. సత్యం, ధర్మం, న్యాయంతో జీవించండి, అదే నీ వృత్తి ధర్మం, అదే నీ నిజమైన రక్షణ….
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


