యువతను డిజిటల్ వ్యసనం పెను సంక్షోభానికి దారితీస్తోంది….
ఆర్థిక సర్వేలో కేంద్రం ఆందోళన…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 01 .
(అఖండభూమి న్యూస్):
దేశంలో విద్యార్థులు, యువతలో డిజిటల్ వ్యసనం ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతుందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఇది మానసిక సంక్షోభానికి, చదువులు, పని సామర్థ్యం పై ప్రతికూల ప్రభావానికి దారితీస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2025, 26 లో వెళ్లడైందని ప్రకటించారు. డిజిటల్ పరికరాల మితిమీరిన వినియోగం వల్ల యువతలో చదువుపై ఏకాగ్రత తగ్గడం, పనితీరు దెబ్బ తినడం, నిద్రలేమి (స్లిప్ డెట్) వంటి సమస్యలు పెరుగుతున్నాయని ఆ సర్వే పేర్కొన్నట్లు తెలిపారు. ముఖ్యంగా 15 నుండి 24 ఏళ్ల వయసు గల వారిలో సోషల్ మీడియా వ్యసనం అధికంగా ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడటం వలన ఆందోళన, డిప్రెషన్, ఆత్మాన్యూనత వంటి మానసిక సమస్యలు పెరుగుతున్నాయని సర్వే హెచ్చరించినట్లు చెప్పారు. ఇతరులతో తమను పోల్చుకోవడం, నిరంతరం స్క్రోలింగ్ చేయడం, యువత మానసిక ఆరోగ్యం పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆ సర్వే వివరించినట్లు తెలిపారు. ఈ సమస్యను ఎదుర్కునేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. మానసిక ఆరోగ్య సహాయం కోసం ప్రారంభించిన తొలి మానస్ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 32 లక్షల ఫోన్ నెంబర్లు సేకరించినట్లు చెప్పారు. సాంకేతిక వ్యసనానికి చికిత్స అందించేందుకు బెంగళూరులోని నిమ్హన్స్ లో షట్ క్లినిక్ ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపింది. ఆన్లైన్ గేమింగ్ ను నియంత్రించేందుకు 2025 లో ప్రత్యేక చట్టం అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. డిజిటల్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించడం సాధ్యం కాదని పేర్కొన్న సర్వే, ప్రత్యమ్నయ మార్గాలపై దృష్టి సారించాలని సూచించింది. పాఠశాలలో డిజిటల్ వెల్నెస్ పై అవగాహన కల్పించే పార్టీ అంశాన్ని ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా పలువురు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఆఫ్లైన్ యూత్ హబ్ ఏర్పాటు చేయాలని సూచించింది. యువత భవిష్యత్తు బలోపేతానికి, శారీరక, మానసిక ఆరోగ్యం పై సమగ్ర దృష్టి అవసరమని ఆర్థిక సర్వే ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


