అచ్చమైన తెలంగాణ కవి మోతుకూరి అశోక్ కుమార్… 

అచ్చమైన తెలంగాణ కవి మోతుకూరి అశోక్ కుమార్…

మెలకువ తీరం పుస్తకావిష్కరణలో ప్రముఖ కవి నందిని సిధారెడ్డి …

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 1 (అఖండ భూమి న్యూస్);

తెలంగాణ రచయితల సంఘం కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రముఖ కవి మోతుకూరి అశోక్ కుమార్ రచించిన “మెలకువ తీరం” కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం ఈరోజు విద్యా నగర్ లోని సీనియర్ సిటిజన్ ఫోరం సమావేశపు హాలులో చాలా ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు, ప్రముఖ కవి డాక్టర్ నందిని సిధారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ కవి తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నాళేశ్వరం శంకరం అధ్యక్షత వహించారు. డాక్టర్ వి శంకర్ పుస్తక పరిచయం చేశారు. తెరసం కామారెడ్డి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రుద్రంగి రమేశ్ , సుప్పని సత్యనారాయణలు కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.

ముఖ్య అతిథి డాక్టర్ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ *తెలంగాణ పల్లె నుడికారాన్ని, అస్తిత్వ భాషను, తెలంగాణ పలుకుబడులను ఒడిసి పట్టిన కవి మోతుకూరి అశోక్ కుమార్. మనిషి జీవితంలోని విభిన్న పార్శ్వాలు, మనిషిని యాంత్రికంగా మార్చుతున్న దృశ్యాన్ని అద్భుతమైన కవిత్వంగా మలచారు. మూడు దశాబ్దాలుగా తనదైన శైలిలో నిబద్దతతో కవిత్వం రాస్తున్న సృజన కారుడు మోతుకూరి అశోక్* అన్నారు.

సభాధ్యక్షులు నాళేశ్వరం శంకర్ మాట్లాడుతూ *అశోక్ కవిత్వం ప్రజలలో సామాజిక స్పృహను, ప్రగతిశీల చైతన్యాన్ని మేలు కొలపుతుందని, రంగుల తోట అనే కవిత ఇందులోని కవితలకు మేనిఫెస్టో లాంటిదని* కొనియాడారు.

*మెలకువ తీరం* పుస్తకం పరిచయం చేసిన ప్రముఖ కవి, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి శంకర్ మాట్లాడుతూ ఇందులోని కవితల నేపథ్యం, కవి దృక్పథం గురించి వివరించారు. *తెలంగాణ పల్లె ఆత్మను పట్టుకొని ఇక్కడి యాసను, భాషను చక్కని శిల్పంతో చిత్రించారు అన్నారు.

ఆత్మీయ అతిథి తెరసం జంటనగరాల అధ్యక్షుడు కందుకూరి శ్రీరాములు, ప్రముఖ గజల్ కవి సూరారం శంకర్, కవులు సిహెచ్ ప్రకాశ్, సిరిగాద శంకర్, గారు పెరుముల కైలాస్, వడ్ల రమేష్, సాయిలు, టి పి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షలు అనిల్ కుమార్, జిల్లా అధ్యక్షులు చింతల లింగం, అంజయ్య సి. ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!