హిందూ దేవాలయాల పరిసరాల్లో అన్యమత ప్రచారం నిషిద్ధం..!

హిందూ దేవాలయాల పరిసరాల్లో అన్యమత ప్రచారం నిషిద్ధం..!

చట్ట ఉల్లంఘనపై కఠిన చర్యలు.

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 2 (అఖండ భూమి న్యూస్);

హిందూ దేవాలయాల పవిత్రతను కాపాడటం మరియు భక్తుల మనోభావాలను గౌరవించడం కోసం ప్రభుత్వం కఠినమైన చట్టాలను అమలు చేస్తోంది.

ముఖ్యంగా హిందూ దేవాలయ చట్టం 30/1987 ప్రకారం, దేవాలయాల పరిసరాల్లో మరియు హిందూ నివాస ప్రాంతాలలో అన్యమత ప్రచారం చేయడం చట్టవిరుద్ధం.

నిషేధిత కార్యకలాపాలు – శిక్షలు

చట్టం ప్రకారం దేవాలయాల వద్ద లేదా హిందూ నివాసాల మధ్య రోడ్లపై పోస్టర్లు అంటించడం, బ్యానర్లు కట్టడం లేదా మైక్ సెట్ల ద్వారా ఇతర మత ప్రార్థనలు చేయడం నిషేధించబడింది.

* జీవో నెం. 746, 747: ఈ నిబంధనలను అతిక్రమించిన వారిని జీవో నెం. 746, 747 ప్రకారం అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇటువంటి కేసుల్లో నిందితులకు బెయిల్ రావడం కూడా కష్టతరమవుతుంది.

* ఇదే చట్టం ప్రకారం, దేవాలయ ఆవరణలో పాన్ పరాగ్, సిగరెట్లు తాగడం లేదా ఉమ్మివేయడం వంటి పనులు చేయడం నేరం.

ఈ నిబంధన హిందువులకైనా వర్తిస్తుంది.

* హిందూ మతాన్ని లేదా దేవుళ్లను దూషిస్తూ మాట్లాడినా, సంస్కృతిని కించపరిచేలా ప్రచురణలు చేసినా IPC సెక్షన్ 295A మరియు 503 కింద కేసులు నమోదు చేయవచ్చు.

* ఎక్కడైనా అన్యమత ప్రచారం జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే స్థానిక ఎస్.ఐ (S.I) కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. నిబంధనల ప్రకారం సెక్షన్ 219 కింద కేసు నమోదు చేయాలి. ఒకవేళ అధికారులు ఫిర్యాదును స్వీకరించడానికి నిరాకరిస్తే, సెక్షన్ 217 ద్వారా ఉన్నతాధికారులను ఆశ్రయించవచ్చు.

దేవాలయాల పవిత్రతను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని, చట్టాలపై అవగాహన కలిగి ఉండటం అవసరం.

పైన పేర్కొన్న సెక్షన్లలో ఐపీసీ (ఇండియన్ పీనల్ కోడ్) స్థానంలో ప్రస్తుతం భారతదేశంలో (భారతీయ నయా సాహిత) అమల్లోకి వచ్చింది.

Akhand Bhoomi News

error: Content is protected !!