మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో దర్శనం ఏర్పాట్లు

శ్రీశైలం అఖండ భూమి న్యూస్ ఫిబ్రవరి 9
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం దేవస్థానం పలు ఏర్పాట్లను చేయడం జరిగింది. ముఖ్యంగా భక్తులందరికీ కూడా సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు భక్తులందరు కూడా అలంకార దర్శనం మాత్రమే కల్పించబడుతోంది.
అయితే జ్యోతిర్ముడి ధరించిన శివదీక్షా భక్తులకు మాత్రం ఉత్సవాలలో అయిదురోజుల పాటు అనగా 08.02.2026 నుండి 12.02.2026 వరకు నిర్ణీత వేళలలో శ్రీ స్వామివారి స్పర్శ దర్శనమునకు అవకాశం కల్పించబడింది.
సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకుగాను ప్రముఖులకు కూడా నిర్ణీత వేళలలో మాత్రమే విరామ దర్శనం కల్పించబడుతోంది.
క్యూలైన్లు
భక్తుల సౌకర్యార్థం మొత్తం అయిదు క్యూలైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఉచితదర్శనం, శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం క్యూలైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా శివదీక్షా భక్తుల ప్రత్యేక క్యూలైన్, వృద్ధులు, దివ్యాంగులకు మరో క్యూలైన్ ఏర్పాటు చేయబడింది. ఉచితదర్శన క్యూలైను రథశాల నుంచి ప్రారంభమవుతుంది. రథశాల వద్ద నుంచి క్యూలైన్లలో ప్రవేశించిన ఉచిత సర్వదర్శనం భక్తులకు క్యూకాంప్లెక్స్ ద్వారా ఆలయ ప్రవేశం కల్పించబడుతుంది. ఈ సర్వదర్శనం భక్తులకు క్యూ కాంప్లెక్స్ నందు వేచి వుండేందుకువీలుగా మొత్తం 20 కంపార్టుమెంట్లలో ఆయా ఏర్పాట్లను చేయడం జరుగుతుంది.
శీఘ్రదర్శనం రుసుము రూ.200/-లు క్యూలైను క్యూకాంప్లెక్సు కుడివైపున క్యాంటిన్ భవనం తొలగించిన చోట నుంచి ప్రారంభమవుతున్నది. అతిశీఘ్రదర్శన క్యూలైన్ రుసుము 500/-లు గతంలో క్యాంపుకోర్టు భవనము గల ప్రదేశం నుండి ప్రారంభమవుతుంది. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లుల క్యూలైన్ ఉమరామాలింగేశ్వరస్వామి ఆలయం ముందు నుంచి ప్రవేశం కల్పించడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి.
క్యూకాంప్లెక్స్‌లో వేచివుండే భక్తులకు నిరంతరం అల్పాహారం, బిస్కెట్లు, మంచినీరు అందించబడుతున్నాయి. అదేవిధంగా క్యూలైన్లలో కూడా భక్తులకు నిరంతరం మంచినీరు అందించడం జరుగుతున్నది. క్యూలైన్లలో అత్యవసర ద్వారాలు ఏర్పాటు చేయబడ్డాయి.
శివదీక్షా భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు*
శివదీక్షా భక్తుల సౌకర్యార్థం పలు ఏర్పాట్లు చేయబడ్డాయి. శివదీక్షాభక్తులు దర్శనానికి వేచివుండేందుకు వీలుగా చంద్రవతి కల్యాణమండపంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయబడ్డాయి. ఈ కల్యాణమండపంలో మొత్తం 4 కంపార్టుమెంట్లు ఆయా ఏర్పాటు చేయబడ్డాయి. దర్శనానికి వేచివుండే శివదీక్షా భక్తులకు నిరంతరం అల్పాహారం, మంచినీరు అందజేయబడుతున్నాయి.
అల్పాహార అందజేతలో ఎటువంటి ఆలస్యం లేకుండా ఉండేందుకు చంద్రవతి కల్యాణమండపం వద్దనే అల్పాహార వంటకాలు చేయడం జరుగుతోంది.
శివదీక్షా భక్తులకు ప్రత్యేక క్యూలైన్*
శివదీక్షా భక్తుల దర్శనానికి కూడా ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రవతి కల్యాణమండపం నుంచి ఈ క్యూలైన్ ప్రారంభమవుతున్నది. దీక్షాభక్తులను ప్రత్యేక క్యూలైన్ ద్వారా దర్శనానికి విడతల వారీగా, నిర్ధిష్ట సమయాలలో దర్శనానికి అనుమతించడం జరుగుతోంది.
క్యూలైన్లను పరిశీలించిన కార్యనిర్వహణాధికారి
దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు పలు క్యూలైన్లను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. అదేవిధంగా చంద్రవతి కల్యాణమండపాన్ని కూడా వారు ఆయా ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తులందరు కూడా దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుంటూ శ్రీస్వామిఅమ్మవార్లను ప్రశాంతగా దర్శించుకోవాలన్నారు. భక్తులరద్దీ అధికంగా ఉంటోందని భక్తులందరు సంయమనంతో పాటించాలన్నారు.
ఇంకా వారు మాట్లాడుతూ అన్ని విభాగాల అధికారులు కూడా పరస్పర సమన్వయంతో విధులు నిర్వహిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎపట్పికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
అదేవిధంగా కార్యనిర్వహణాధికారివారు పలువురు భక్తులతో ముఖాముఖిగా సంభాషిస్తూ దేవస్థానం చేస్తున్న ఏర్పాట్లపై చర్చిస్తున్నారు. శ్రీశైలదేవస్థానం ఈవో,యం శ్రీనివాసరావు తెలిపారు,,
You may also like
రంపచోడవరం కేంద్రంగా గిరిజన ఐక్యతకు పిలుపు – ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు ఘన అభినందన సభ
శ్రీ కాళహస్తి దేవస్థానం వారిచే పట్టువస్త్రాల సమర్పణ
శ్రీ కాళహస్తి దేవస్థానం వారిచే పట్టువస్త్రాల సమర్పణ
మోసపూరిత మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ : మాజీ మంత్రి హరీష్ రావు
తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు


