*ప్రచారంలో దూసుకపోతున్న 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గంప ప్రసాద్ ..!* 
*8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గంప ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ ..*
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 08 ( అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి పట్టణంలోని 8 వ వార్డులో కౌన్సిలర్ కాంగ్రెస్ అభ్యర్థి గంప ప్రసాద్ ఆదివారం ప్రచారంలో దూసుకుపోతున్నారు. 8వ కౌన్సిలర్ వార్డులో తన ప్రచార రథం తో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ పాటు తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి పెద్ద ఎత్తున ఆదివారం ప్రచారం నిర్వహించారు. 8వ వార్డు అభివృద్ధిలో ముందుకు దూసుకుపోవాలంటే చేతి గుర్తుపై ఓటు వేసి అమూల్యమైన ఓటును వెయ్యాలని అభ్యర్థించారు. గత పాలకుల మాదిరిగా కాకుండా ప్రస్తుతం మారుతున్న అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని జిల్లా కేంద్రంలోని 8వ వార్డును అన్ని రకాల అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడమే తమ లక్ష్యమని అన్నారు. స్థానిక మౌనిక సదుపాయలతో పాటు, 8వ వార్డును కామారెడ్డి జిల్లాలోని ఆదర్శవంతమైన వార్డుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని వారి సహకారంతో వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
You may also like
బెల్లంపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవయవ,నేత్ర,శరీర దానం పై అవగాహనా ర్యాలీ
జిల్లా కాంగ్రెస్ నాయకులను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…
దోమకొండ ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గం త్వరలో ఏర్పాటు..!
కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ…
గ్యాంగ్ ఫైల్స్’ నేరాలపై జిల్లా ఎస్పీ కీలక సమీక్ష


