ఫిబ్రవరి 13 న జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయండి

ఫిబ్రవరి 13 న జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయండి

– జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎస్ టి యు

ఎర్రగొండపాలెం యర్రగొండపాలెం అఖండ భూమి.

పి ఆర్ సి కమిటీ ఏర్పాటు,

ఐ .ఆర్. మంజూరు, బకాయిల చెల్లింపు, సిపిఎస్ రద్దు తదితర ప్రభుత్వ మేనిఫెస్టో హామీల అమలు కోరుతూ రాష్ట్రోపాధ్యాయ సంఘం ఎస్టియు రాష్ట్ర సంఘం ఇచ్చిన మూడు దశల పోరాట కార్యక్రమంలో భాగంగా రెండవ దశ లో ఫిబ్రవరి 13వ తేదీన మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ఎస్టియు ధర్నా కార్యక్రమానికి ఎస్టియు రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులు, కౌన్సిలర్లు, మండల నగరపాలక పురపాలక అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని

ఎస్.టి.యు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి టీకేఎస్ ప్రసాద్ ఆర్ దేశా నాయక్ పిలుపునిచ్చారు.

వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్లకు ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ఇచ్చిన క్రింది హామీలను అమలు పరచలేదని కావున వెంటనే క్రింది హామీలను అమలు పరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేసి 30% IRను ప్రకటించాలని

CPS రద్దుచేసి OPS అమలు చేయాలని

2004 సెప్టెంబర్ 1 కంటే ముందు నోటిఫికేషన్ ద్వారా నియామకం పొందిన 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు పోలీసులు మరియు ఇతర శాఖల ఉద్యోగులకు OPS అమలు చేయాలని

పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ఇవ్వవలసిన గ్రాడ్యుటీని వెంటనే మంజూరు చేయాలని ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు చెల్లించాల్సిన 4 DAలను వెంటనే చెల్లించాలి.

రెండవ దశలో ఫిబ్రవరి 13వ తేదీన అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల వద్ద జరిగే జిల్లాస్థాయి ధర్నా కార్యక్రమానికి ప్రభుత్వం స్పందించకపోతే

మూడవ దశలో ఫిబ్రవరి 25వ తేదీ జరిగే చలో విజయవాడ కార్యక్రమానికి ఎస్టీయూ నాయకులు కార్యకర్తలు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

కావున ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్లకు ఇచ్చిన మేనిఫెస్టో హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వానికి హితవు పలికారు.

Akhand Bhoomi News

error: Content is protected !!