మార్చిలో జిల్లా , మండల పరిషత్ ఎన్నికలు..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; ఫిబ్రవరి 12.
(అఖండభూమి న్యూస్):
మార్చి మాసంలో జిల్లా , మండల పరిషత్, జిల్లా పరిషత్ లకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం. బుధవారం నాడు జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తున్నాయని వివిధ సర్వేలు ప్రకటించడంతో అదే జోష్ ను కొనసాగించేందుకు ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మండల, జిల్లా పరిషత్తుల ఎన్నికలు పూర్తయి. పాలకవర్గాలు ఏర్పడితే కేంద్రం నుండి రావలసిన నిధులు వచ్చేందుకు అవకాశాలు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సకాలంలో ఎన్నికలు పూర్తికాకుంటే మండల, జిల్లా పరిషత్తులకు కేంద్రం నుండి 450 కోట్ల నిధులు మునిగిపోయే ప్రమాదం ఉందని కాబట్టి సకాలంలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వ యోజన. అందుకే పరిషత్ ఎన్నికలు త్వరితగతిన నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుంది.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


