కామారెడ్డి మున్సిపాల్ చైర్పర్సన్ పీఠం ఇప్ప ఉమారాణి కే..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 16(అఖండ భూమి న్యూస్);
ఈనెల 11న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కామారెడ్డి మున్సిపల్ ప్రజలు ఏ పార్టీకి పూర్తి మెజారిటీని ఇవ్వలేదు దీంతో బీఆర్ఎస్ పార్టీ కీలకంగా మారింది. గత మూడు నాలుగు రోజులుగా ఎవరు చైర్ పర్సన్, ఎవరు వైస్ చైర్ పర్సన్ ఏ పార్టీ నుండి వస్తారని ప్రచారం జరిగింది. మంగళవారం మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ల ఎన్నిక నిర్వహించాగా కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గా స్వతంత్ర అభ్యర్థి 38 వార్డ్ కౌన్సిలర్ ఇప్ప ఉమారాణి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో నిలువగా కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 49 వార్డు కౌన్సిలర్ మహమ్మద్ ఇసాక్ ప్రతిపాదించగా, 1 కాంగ్రెస్ పార్టీ, 29వ వార్డ్ కౌన్సిలర్ మహమ్మద్ అంజద బలపరిచారు. ఓటింగ్ నిర్వహించగా ఉమారాణికి అనుకూలంగా 33. ఓట్లు వచ్చాయి. దీంతో ఆమె చైర్పర్సన్ ఎన్నిక అయినట్లు ఎన్నికల అధికారులు విజేతగా ప్రకటించారు.
వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ పార్టీకి చెందిన 12 వార్డ్ కౌన్సిలర్ కాసర్ల గోదావరిని బీఆర్ఎస్ పార్టీకి చెందిన 45వ వార్డు కౌన్సిలర్ పిట్ల వేణుగోపాల ప్రతిపాదించగా, బీఆర్ఎస్ పార్టీకి చెందిన 18వ వార్డు కౌన్సిలర్ మిర్జా ఆఫీస్ బెగ్ బలపరిచారు. ఓటింగ్ నిర్వహించగా 33 ఓట్లు వచ్చాయి దీంతో వైస్ చైర్మన్ గా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, వైస్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ కసర్ల గోదావరి, కామారెడ్డి పట్టణ కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.


