షబ్బీర్ ను ఐదు సార్లు ఓడించిన కామారెడ్డి దరిద్రం పోతలేదు…

షబ్బీర్ ను ఐదు సార్లు ఓడించిన కామారెడ్డి దరిద్రం పోతలేదు…

 

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 17 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ అలీ షబ్బీర్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఓడించిన ప్రస్తుతం సైతం దరిద్రం పోతలేదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం

బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం మంగళవారం నిర్వహించి ఈ సందర్భంగా మాట్లాడారు.

మున్సిపల్ ఎన్నికల్లో గెలిచానని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ విర్రవీగుతున్నాడాని అన్నారు.

 

ప్రతి సారి నన్ను రెచ్చగొడుతున్నాడని ఆరోపించారు.

 

కొత్త మేకలకు అతని గురించి తెలువదనీ జర జాగ్రత్త అన్నారు.

 

నేను కూడా పాత బాకరనే అని

దొంగ సారా , దొంగ కట్టే అమ్ముకొనేటోడు అని గుర్తు చేశారు.

 

మా నాన్న దగ్గర శిష్యరికం చేసిన షబ్బీర్ అలీ

1989 ల ఎమ్మెల్యే గా గెలిచినప్పటి నుండి వీడియోలు ఫోటోలు ఉన్నాయి అని అన్నారు.

 

అప్పుడు నీ ఆస్తి ఎంత ఇప్పుడు నీ ఆస్తి ఎంత అన్నారు.

 

5 ఫ్లోర్ల బిల్డింగ్లు కట్టాడు, ఫైర్ ఇంజన్ కూడా తిరుగదు. ఈయన నాయకుదా?,

దొర నవాబు , షబ్బీర్ అలీ చమత్కారంగా మాట్లాడారు.

 

ఏ వారి దగ్గర ఎంత గోకినవో వాళ్ళకు తెలుసు అని

నీకు ఉర్దూ తప్ప తెలుగు రాదు అని అన్నారు.

కామారెడ్డికి నీ దరిద్రం పోతలేదు అని గుర్తు చేశారు.

కామారెడ్డి లో నిన్ను 5 సార్లు ఓడగొట్టింది అని గుర్తు చేశారు.

నీకు దమ్ము ధైర్య ఉంటే ఉంటేరా గుడి, దర్గా, మసీదులో నీ భార్య పిల్లలతో రా , కూర్చొని ప్రజల ముందు చర్చిస్తామని సవాల్ విసిరారు. నేను నా వాళ్ళతో వస్తా,

అరోరా కాలేజీ కి గజం మా నాన్న అమ్మితే నేను ఆరా గుండు కొట్టించుకొని, మీసం లేకుండా తిరుగుతా అని సవాల్ విసిరారు.

కామారెడ్డి కి పట్టిన శని షబ్బీర్ ఆలీ, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉండి ఏం సాధిస్తావ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

కామారెడ్డి లో కబ్జాలు చేసినావు. నువ్వు నీ తమ్ముడు అన్నిటికి ఆధారాలు ఉన్నాయి.

26 ఎకరాలు రామారెడ్డి రాడ్ లో 7 ఎకరాలు బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకున్నావ్ అని ఆరోపించారు.

దేమే రాజిరెడ్డి, కేఆర్ రాజిరెడ్డి లు కామారెడ్డి లొ ఎంతో సేవ చేశారు. వారిని నిందిస్తావా అని అన్నారు.

నాదగ్గర ఎమ్మెల్సీ గా పోటీచేస్తే నా దగ్గర 5 లక్షలు తీసుకున్నావు ఆరోపించారు.

 

నీతో ఉన్న వాళ్ళకు నువ్వు ఏం చేశావు. బయట చెప్పుకో లేక పోతున్నారు.

 

ముఖ్య మంత్రి దగ్గర నీ గురించి చెప్పిన దొంగవని,

దొంగ ను పక్కకు పెట్టమని నా పేరు తగ్గుతదని ఎక్కడ ఈ విషయం బయట పడలేదని అన్నారు.

 

నీవల్ల ఒక్క కార్య కర్త బాగు పడ్డాడా చెప్పమను అని అన్నారు.

 

షాబాజ్ ఎవడు నీ పి ఏ నా ఎవడు సీఎంఆర్ఎఫ్ కు డబ్బులు డిమాండ్ చేస్తాడు అని అన్నాడు.

 

షాబాజ్ ఫోన్ పే లిస్ట్ తీస్తే అన్ని తెలుస్తాయి అని గుర్తు చేశారు.

 

దొంగలు అందరూ నీతో నీచుట్టూ ఉన్నారు అని అన్నారు.

 

టిఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని అడగలేదు అంటున్నారు. మీ నాయకులను అడగండి అని గుర్తు చేశారు.

 

వరదలప్పుడు నేను ప్రజలతో ఉన్నాను కండ్లు ఎక్కడ పోయినవి..చూసుకో మీడియాను అడిగి తెలుసుకోవాలన్నారు.

 

ఇందిరా చౌక్ లో ఆమె విగ్రహం పెట్టడానికి 20 లక్షలు వసూలు చేసినావు అని గుర్తు చేశారు.

 

నేను తప్పు చెయ్య నిన్ను చేయ నియ్యను అని అన్నారు.

 

నా దగ్గర తప్పులు లేకుండా అరో పిస్తే విపులు సున్నం చేస్తా అన్నారు.

 

కొట్టడం, రాజకీయం , తిట్టడం రాజకీయం అయితే నేను ఇప్పటినుండి అలానే చేస్తా అన్నారు.

 

అవినీతిపై ఇక యుద్ధం ప్రారంభమైందన్నారు.

 

బీఆర్ఎస్ వాళ్లను అడగలేదు.అంటున్నారు. గోవర్ధన్ ను, ముజీబ్ ను అడగండి. అని గుర్తు చేశారు.

 

ఒక్క అధికారి తప్పు చేసిన, రాజకీయ నాయకులు తప్పు చేసిన క్షమించేది లేదన్నారు.

 

పోలీసులు నా బండి ఆపి తనిఖీ చేస్తారు. నేను ఎమ్మెల్యే

నీ కొడుకు రేప్ కేసు బయటకు తీస్తా అన్నారు. దొంగ సారా కేసు తీస్తా అని ఆరోపించారు.

నన్ను ప్రజలు విస్మరిస్తారు అనుకుంటే పోటీ కూడా చెయ్య.అంత అభిమానం ఉంది అని అన్నారు.

 

ప్రజలు బిజెపికి 16 మంది కి పట్టం కట్టిండ్రు అని అన్నారు.

 

నామీద ప్రెస్ మీట్ లు పెడితే చూస్తా తదుపరి స్పందిస్తానన్నారు.

 

మంచితనం ఉన్న ఏ పార్టీ నాయకుడు అయినా నా సోదరి , అన్నలుగా భావించానని అన్నారు.

 

కామారెడ్డి లో దొంగలు అందరూ ఒక్కటి అయ్యారు తస్మాత్ జాగ్రత్త అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!