కామారెడ్డి ఎమ్మెల్యే తీరుపై కాంగ్రెస్ నిప్పులు.. ‘వీధి రౌడీలా విమర్శలు చేయడం సరికాదు…

నీ బండారం బయటపెడతాం కాంగ్రెస్ నాయకులు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 17 (అఖండ భూమి న్యూస్);
:స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వైఖరిపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మంగళవారం విరుచుకుపడ్డాయి.
మున్సిపాలిటీ చేజారిందన్న ఫ్రస్టేషన్‌లో ఎమ్మెల్యే ఒక సైకోలా ప్రవర్తిస్తున్నారని, ప్రజాప్రతినిధి హోదాను మరచి వీధి రౌడీలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
మంగళవారం కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, డిసిసి మాజీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు, గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డిలు అన్నారు.
షబ్బీర్ అలీపై ఆరోపణలు చేస్తే సహించం అని హెచ్చరించారు.
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు.
“షబ్బీర్ అలీ కుటుంబ సభ్యులు చట్టబద్ధంగా డబ్బులు చెల్లించి భూములు కొనుగోలు చేశారు తప్ప, ఎవరినీ బెదిరించి కబ్జాలు చేయలేదు అని అన్నారు.
షబ్బీర్ అలీ కాలి గోటికి కూడా సరితూగని వ్యక్తివి, నీవు చిల్లర మాటలు మాట్లాడటం మానుకోవాలనీ ,మర్యాద తప్పితే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అదే స్థాయిలో సమాధానం చెప్తారు” అని హెచ్చరించారు.
ఎమ్మెల్యే ‘కబ్జాల’ చిట్టా ఇదే.. ఆధారాలతో సహా
ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గత చరిత్రను సాక్ష్యాధారాలతో సహా కాంగ్రెస్ నాయకులు ఎండగట్టారు.
రిటైర్డ్ ఉద్యోగుల భూమి కబ్జా: తన విద్యాసంస్థ పక్కన ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల భూమిని కబ్జా చేసి ప్రహరీ గోడ కట్టారని, కోర్టు ఆర్డర్లను సైతం లెక్కచేయకుండా 30 వేల గజాల భూమిని బెదిరించి 3 వేల గజాలకు తగ్గించలేదా? అని ప్రశ్నించారు.
కర్షక్ విద్యాసంస్థల కుంభకోణం ,రైతుల బిడ్డల కోసం సేకరించిన 260 ఎకరాల భూమిని అరోరా ఇంజనీరింగ్ కాలేజీకి దారదత్తం చేసి, ఆ భూములను బ్యాంకులో కుదవపెట్టి రూ. 7 కోట్లు తీసుకున్నది వాస్తవం కాదా? అని నిలదీశారు.
ఫోర్జరీ సంతకాలపై కోర్టు కేసులు ఉన్న విషయం గుర్తు చేశారు.
జపాన్ పర్యటన మిస్టరీ: “మూడు నెలల క్రితం జపాన్ పర్యటన వెనుక అసలు కథ ఏంటి? అక్కడ ఏం చేశావో సెకండ్ ఎపిసోడ్‌లో నీ బండారం బయటపెడతాం” అని హెచ్చరించారు.
రోడ్డు నిర్మాణం వెనుక కమీషన్లు: టేక్ర్యాల్ నుండి లింగాపూర్ 100 ఫీట్ల రోడ్డును ఎమ్మెల్యే కాకముందు అడ్డుకున్న వ్యక్తివి, ఇప్పుడు ముందుండి ఎందుకు వేయిస్తున్నావు? అందులో నీకు ఎంత ముట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
వరుస మోసాలు – బెదిరింపులు
ఎమ్మెల్యే తన సొంత మిత్రులను, వ్యాపార భాగస్వాములను కూడా వదలలేదని నాయకులు ఆరోపించారు:
టీవీ కేబుల్ నెట్వర్క్ పేరుతో పార్టీ నాయకులను నట్టేట ముంచారని.
అశోక్ నగర్ కాలనీకి చెందిన ఒక అమాయకుడి ఇంటి కాగితాలు బ్యాంకులో పెట్టి రూ. 20 లక్షల అప్పు చేసి, తీర్చలేక పారిపోయారని అన్నారు.
అంతంపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 146లో 1 ఎకరం 12 గుంటల భూమిని ‘రైస్ పుల్లింగ్’ పేరుతో నరసింహారెడ్డి అనే వ్యక్తిని మోసం చేసి కబ్జా చేశారని బాధితులు వాపోతున్నారని తెలిపారు.
దమ్ముంటే సీఎస్ఐ గ్రౌండ్‌కు రా!
“అధికారులకు నోటితో కాదు చేతితో పని చెప్తా అంటున్నావు..
నాపై ప్రెస్ మీట్ పెడితే కొడతా అంటున్నావు.. దమ్ముంటే రా! ఎవరిని కొడతావో, ఎక్కడికి రమ్మంటావో చెప్పు.. మేము సిద్ధం” అంటూ కాంగ్రెస్ శ్రేణులు బహిరంగ సవాల్ విసిరారు.
ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోతే ప్రజలే నీ బట్టలు ఊడదీసే రోజు దగ్గరలోనే ఉందని, నిన్ను ఎర్రగడ్డకు తరలించే సమయం ఆసన్నమైందని ఎద్దేవా చేశారు.
ఈ సమావేశంలో వార్డు కౌన్సిలర్లు అంజద్, మాజీద్, లడ్డు, సిద్ధిక్, కళ్లెం సత్యం, యూనిస్, వాజీద్, అనంతరెడ్డి, గంప ప్రసాద్, జమీల్, విద్యార్థి నాయకులు సందీప్ చందు, తుడుము ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.


