కామారెడ్డిలో లో హై టెనన్షన్

కామారెడ్డిలో లో హై టెనన్షన్

– కొనసాగుతున్న అరెస్ట్ ల పర్వం…

– కామారెడ్డి ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన పోలీస్ బలగాలు.

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 21 (అఖండ భూమి న్యూస్);

 

కామారెడ్డిలో హైటెన్షన్ నెలకొంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆస్తుల విషయంలో చర్చకు రావాలని కాంగ్రెస్ నాయకులు సవాల్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాను చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రకటించడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల అంశం చర్చనీయాంశంగా మారింది. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆస్తుల విషయంలో ఇటీవల కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు. దీనిపై చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే చెప్పడంతో కామారెడ్డిలో హై టెన్షన్ నెలకొంది. శనివారం ఉదయం నుంచే పోలీసులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్, సరస్వతి శిశుమందిర్, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. కళాశాల వద్ద బందోబస్తును జిల్లా ఏ ఏస్పి చైతన్య రెడ్డి, జిల్లా అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టారు. మరోవైపు ఎమ్మెల్యే క్యాంఫ్ ఆఫీస్ లో ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేసిన అదంతా ఏమి లేదని పోలీసులు తెలుపుతున్నారు. క్యాంప్ కార్యాలయం వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

కార్యకర్తలు ఎవరు రావొద్దు

కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలు తన కుటుంబానికి సబంధించినవి అని, ఇది పూర్తిగా తన వ్యక్తిగతమని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి తెలిపారు. కార్యకర్తలు ఎవరు కూడా కామారెడ్డికి రావద్దని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్యకర్తలు ఎవరు రారని పోలీసులకు తాను మాట ఇచ్చానని, తన మాటకు విలువ ఇచ్చి ఎవరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవద్దని కోరారు. తన కుటుంబంపై చేసిన ఆరోపణలు నిజం కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.

కాగా కామారెడ్డి ఎమ్మెల్యే ఇంటికి పోసానిపేట్ మాజీ సర్పంచ్ గిరెడ్డి మోహన్ రెడ్డి చేరుకొని నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. కాగా బీజేపీ కార్యకర్తలు ఆయన కారు ను అడ్డుకున్నారు. కారుకు మంటలు అంటుకోవడంతో అర్పి కారు ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఇంటి వద్ద పోలీస్ ప్రహర కొనసాగుతుంది.

Akhand Bhoomi News

error: Content is protected !!