తాడ్వాయిలో హుండీ చోరీ కేసు చేదించిన పోలీసులు…
– పెట్రోలింగ్ సిబ్బంది అప్రమత్తతతో నిందితుడు అరెస్ట్.
– వివరాలు వెల్లడించిన తాడ్వాయి ఎస్‌ఐ వై. నరేష్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 20.
(అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడ్వాయి గ్రామంలో ఉన్న శబరీ మాత ఆశ్రమానికి ఎదురుగా ఉన్న కొండపై గల హనుమాన్ దేవాలయంలో జరిగిన హుండీ చోరీ కేసును పోలీసులు వేగంగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు.
గురువారం ఉదయం సుమారు 04.00 గంటల సమయంలో తాడ్వాయి గ్రామంలోని శబరీ మాత ఆశ్రమానికి ఎదురుగా ఉన్న కొండపై గల హనుమాన్ దేవాలయంలో చోరీ ఘటనపై పూజారి శ్రీ శీతారాందాస్ త్యాగి , తాను బుధవారం రాత్రి దేవాలయాన్ని తాళం వేసి మరుసటి రోజుగురువారం ఉదయం దేవాలయాన్ని తెరవడానికి వెళ్లగా, దేవాలయం ముందు ఉన్న ఇనుప హుండీ తాళం పగులగొట్టి ఉన్నదని, అందులో ఉన్న కొంత నగదును దొంగిలించారని ఇచ్చిన ఫిర్యాదుపై తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించారు.
కేసు వివరాల్లోకెళ్తే: శుక్రవారం ఉదయం హోం గార్డ్ బాలాజీ మరియు పోలీస్ కానిస్టేబుల్ అనిల్ పెట్రోలింగ్ విధుల్లో భాగంగా తాడ్వాయి గ్రామ పరిధిలో గస్తీ నిర్వహిస్తున్న సమయంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటం గమనించి వెంటనే వెంబడించి పట్టుకున్నారు. విచారణలో అతను పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో పాటు అతని షర్ట్‌పై తాజాగా ఉన్న కలర్ గుర్తించడం వల్ల మరింత అనుమానం కలిగింది.
అతనిని పోలీస్ స్టేషన్‌కు తరలించి సాంకేతిక ఆధారాలతో పరిశీలించగా, అతని పేరు గోడండ్ల పావులు, రాంపూర్ గ్రామం, లింగంపేట మండలానికి చెందినవాడని గుర్తించారు. తదుపరి విచారణలో, తాడ్వాయి గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో 18/19.02.2026 రాత్రి హుండీ చోరీ చేసినట్లు మరియు మళ్లీ చోరీ చేయడానికి వచ్చిన సమయంలో పోలీసులకు పట్టుబడ్డట్లు ఒప్పుకున్నాడు.
అలాగే నిందితుడు గతంలో ఎల్లారెడ్డి మరియు నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఐదు దేవాలయ హుండీ చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తేలింది. ఇటీవల తేది 28.01.2026న పాత కేసులో బెయిల్‌పై విడుదలైనట్లు కూడా విచారణలో వెల్లడైంది.
అరెస్ట్ & స్వాధీనం:
నిందితుడు గోడండ్ల పావులను అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి క్రింది వస్తువులను స్వాధీనం చేసుకున్నారు:
దొంగతనానికి ఉపయోగించిన ఐరన్ రాడు పగులగొట్టిన హుండీ తాళం.
• రూ. 200/- నగదు • కలర్ మరకలు ఉన్న షర్ట్
పెట్రోలింగ్ విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించి, నిందితుడిని వెంటనే పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన హోం గార్డ్ బాలాజీ మరియు పోలీస్ కానిస్టేబుల్ అనిల్ ని జిల్లా ఎస్పీ అభినందించినట్లు తాడ్వాయి ఎస్‌ఐ నరేష్ తెలిపారు.
You may also like
ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ పంటల సాగుతో రైతులకు అధిక దిగుబడును
ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ మొక్కలు నాటిన వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వర్…
ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి ఎమ్మెల్యే తీరుపై కాంగ్రెస్ నిప్పులు.. ‘వీధి రౌడీలా విమర్శలు చేయడం సరికాదు…
షబ్బీర్ ను ఐదు సార్లు ఓడించిన కామారెడ్డి దరిద్రం పోతలేదు…


