దోమకొండలో కంపు కొడుతున్న ప్రధాన డ్రైనేజ్ లు..!

దోమకొండలో కంపు కొడుతున్న ప్రధాన డ్రైనేజ్ లు..!

డ్రైనేజీల్లో పేరుకుపోయిన దుర్గంధం..

ప్రధాన డ్రైనేజీల్లో దోమలు వృద్ధి ..

దోమకొండలో పెరుగుతున్న డెంగ్యూ, మలేరియా కేసులు..

సలహాలు లేవు, సూచనలు కరువు..

పట్టించుకోని ప్రత్యేక అధికారులు,.

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 22 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ప్రధాన డ్రైనేజీలు మురికి పేరుకుపోయి కంపు కొడుతున్నాయి. దోమకొండ శివరాం మందిర్ సమీపంలోని ప్రధాన మురికి కాలువ గ్రామ చివరి వరకు ఉన్న ప్రధాన మురికి కాలువ డ్రైనేజీలో మురికి పేరుకుపోయి అటుగా వెళుతున్న వారికి తో పాటు పరిసర ప్రాంతాల నివాస గృహాలకు మురికి కంపుతో అల్లాడుతున్నారు. ఇటీవల దోమకొండ మండల కేంద్రంలో అత్యధికంగా దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా, ఇతర వ్యాధుల బారిన ప్రజలు పడి అల్లాడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు బారులు తీరుతున్నారు. కొందరు జ్వరంతో ఆసుపత్రులకు రావడంతో సరైన చికిత్సలు అందకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి అప్పుల పాలు అవుతున్నారు. ఇకనైనా గ్రామపంచాయతీ, పాలకవర్గంతోపాటు, వైద్య సిబ్బంది ప్రజలకు సలహాలు సూచనలతో పాటు పరిసరాలను ప్రజలు పరిశుభ్రంగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో నే అతి పెద్ద మేజర్ పంచాయతీ అయినా దోమకొండలో ఇలాంటి పరిస్థితులు తలెత్తడంతో ప్రజలు ప్రధాన కాలువల పరిశుభ్రం చేయడంలో నిర్లక్ష్యంపై చర్చించుకుంటున్నారు. మండల ప్రత్యేక అధికారి దృష్టి కేంద్రీకరించాలన్నారు. వైద్య సిబ్బంది ప్రజలకు తీసుకోవాల్సిన సలహాలు సూచనలను దోమకొండ లో పలు వార్డుల ప్రజలకు సూచించాలని కోరుతున్నారు. పాత తాలూకా కేంద్రమైన దోమకొండలో మున్సిపాలిటీకి తీసుకోకుండా అత్యధిక జనాభా కలిగి ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. పచ్చదనం, పరిశుభ్రతతో పాటు త్రాగునీరు, వేసవి కాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై సూచనలు అందించాలని కోరుతున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!