ఎమ్మెల్యే రమణారెడ్డి జోలికి వస్తే సహించేది లేదు…
కామారెడ్డి బిజెపి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజు లు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 22 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై శనివారం కాంగ్రెస్ గుండా దాడి కి నిరసనగా, జరిగిన పరిణామాలపై ఇక సహించేది లేదని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు అన్నారు. ఆదివారంవిలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడారు.
చర్చకు రమ్మంటే క్యాంపు కార్యాలయంలోకి దాడి కి వచ్చారు. ఆరోపణలు చేసిన వ్యక్తి రావాలని పిలుపునిస్తే కాంగ్రెస్ నాయకులను వెంట వేసుకొని వచ్చి డ్రామాలు చేశారు. మా నాయకుడు ఎమ్మెల్యే రమణ రెడ్డికి ప్రాణ హాని ఉంది అని అన్నారు. వారికి తగు రక్షణ కల్పించాలన్నారు. నిన్న క్యాంపు కార్యాలయంపై దాడి జరిగిన తర్వాత రమణ రెడ్డికి మద్దతుగా కామారెడ్డి కి బయల్దేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్, రావు, మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ని, ఎమ్మెల్యే లు రాకేష్ రెడ్డి, పాయల్ శంకర్ గారిని, ఎమ్మెల్సీ అంజిరెడ్డి ని, బీజేపీ సీనియర్ నాయకులు ఎండల లక్ష్మీనాయణ ని మార్గ మధ్యలో అడ్డుకొని అరెస్ట్ చేసి కామారెడ్డి కి రానీయకుండా అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్ని అరెస్ట్ లు చేసిన నీతిగా ఉన్న రమణ రెడ్డి జోలికి వస్తె ఊరుకునేది లేదని ఆయన వెంట బీజేపీ పార్టీ మొత్తం ఉందని అన్నారు. భవిష్యత్తులో ఇకనుండి జరిగే అవినీతిపై తనదైన శైలిలో ముందుకు వెళ్లి అడ్డుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కౌన్సిలర్ లు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


