అంబారీపేట గ్రామంలో ప్రారంభమైన రేణుక ఎల్లమ్మ ఉత్సవాలు…
అంబరాన్ని అంటిన ఎల్లమ్మ ఉత్సవాలు సంబరాలు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 22 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ. మండలంలోని అంబారిపేట్ గ్రామంలో రేణుక ఎల్లమ్మ ఆలయం 6 వ వార్షికోత్సవం సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షుడు రంగోలి మైసా గౌడ్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభించారు. మహా యజ్ఞం కార్యక్రమంలో ప్రత్యేక పూజలు చేసి, గ్రామదేవతలకు మహిళలతో బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సోమవారం రోజున పుట్ట బంగారము తెచ్చుట, ఏడు అంతరాల బోనం, ఎరుకలి బుట్ట, ఎల్లమ్మ తల్లికి బోనాలు తీయుట, 24వ తేదీ మంగళవారం రోజున రేణుక ఎల్లమ్మ జమదగ్నిల కళ్యాణం వేడుకలు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. బుధవారం రోజున తిరుగు బోనాలు విందు కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రంగోలి సత్య గౌడ్, గౌడ సంఘం సభ్యులు రంగోలు శ్రీనివాస్ గౌడ్, మైసా గౌడ్, లింగా గౌడ్, ఈశ్వర్ గౌడ్, తదితరులు , గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


