షాట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

షాట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

 

బెల్లంపల్లి ఫిబ్రవరి 23(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా చంద్రవెల్లి గ్రామంలోని సోమవారం ఇప్ప లత భర్త కీ :శే :శ్రీనివాస్ మహాలక్ష్మి నగర్ లోని కరెంట్ షాట్ సర్క్యూట్ అవ్వడంతో ఇంటిలోని సామాగ్రి,బట్టలు,టీవీ,కూలర్, ఫ్యాన్,ఫ్రిజ్ నగదు 50వేల రూపాయలు అరతులం బంగారం అలాగే వాళ్ళ అబ్బాయి స్టడీ ఒరిజినల్ సర్టిపికెట్స్ కాలి బూడిద అవ్వడం జరిగింది.కఠిన పేదరికంలో ఉన్నవారి కుటుంబానికి ఇలా జరగడం చాలా దురదృష్టకరం.స్థానిక ఎమ్మెల్యే చొరవతో ప్రభుత్వం నుండి ఏదైనా నష్టపరిహారం ఇప్పిస్తే చాలా బాగుంటుందనీ గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేసారు.అలాగే ప్రస్తుతానికి ఇల్లుకాలి దిక్కుతోచని స్థితిలో ఉన్న వారికీ ఎవరికీ తోచినంత సహాయం చేయగలరనీ గ్రామస్తులు కోరుకుంటున్నారు…

Akhand Bhoomi News

error: Content is protected !!