కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఆడా ఉంటా.. ఈడా ఉంటా..!

కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఆడా ఉంటా.. ఈడా ఉంటా..!

కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించడమే షబ్బీర్ అలీ ఏకైక లక్ష్యం..

పార్టీలు మారిటోడు కాదు.. ఒకే పార్టీలోనే ఉంటాడు షబ్బీర్అలీ..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 23 (అఖండ భూమి న్యూస్);

కష్టాలు వచ్చిన, నష్టాలు వచ్చిన ఒకే కాంగ్రెస్ పార్టీని సిద్ధాంత పరంగా నమ్ముకొని సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని, అధిష్టానం నా సేవలను వినియోగించడం కోసం ఆడా ఉంటా , ఈడా ఉంటా అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. సోమవారం కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం సత్యా గార్డెన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడారు. కామారెడ్డిలో గత అసెంబ్లీ ఎన్నికలలో వెనుకబడ్డ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని ముందంజలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం జరిగిందని గుర్తు చేశారు. కామారెడ్డి మున్సిపల్ పై కాంగ్రెస్ జెండాని ఎగర వేయడమే లక్ష్యంగా బరీ లోకి దిగిన కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుందని అన్నారు. కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికైన ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ను అభినందించారు. కామారెడ్డి పట్టణం అన్ని రంగాల అభివృద్ధి చెందడానికి తన వంతు కృషి చేస్తే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి మరింత అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నాలు చేస్తానని హామీ ఇచ్చారు. కామారెడ్డి నియోజకవర్గం లో ఇంచార్జి మంత్రులను తీసుకువస్తానని, ఇతర మంత్రులను తీసుకువస్తానని హాస్యస్పదంగా ఉందన్నారు. నేను పదవిలో ఉన్న, లేకున్నా కామారెడ్డి నియోజకవర్గం ను అభివృద్ధి చేయడంలో కేరాఫ్ గా షబ్బీర్ అలీ అందుబాటులో ఉంటారని అన్నారు. ఇదే కామారెడ్డి ప్రజలకు, కామారెడ్డి నియోజకవర్గంలో పై షబ్బీర్ అలీ వెన్న అంటూ ఉండి ప్రగతి సాధించడం పై మరింత దృష్టి సాగిస్తానని అన్నారు. కొందరు పని కట్టుకొని నాపై విమర్శ చేస్తున్నారని అన్నారు. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వారిని గుర్తించకుండా తనపై విమర్శలు చేయడం వారి వ్యక్తిత్వానికి వదిలేస్తున్నానని అన్నారు. నా కర్తవ్యం, పట్టుదల, ప్రజల సమస్యలను తీర్చడంతోపాటు అభివృద్ధిలో దూసుకుపోవడమే నా లక్ష్యంగా ఊపిరి ఉన్నంతవరకు పని చేస్తానని అన్నారు. నా రాజకీయ జీవితంలో ఎలాంటి ఒక్క కేసు లేదని అన్నారు. తనపై పని కట్టుకొని చేసే విమర్శలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి కౌన్సిలర్ తో పాటు ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!