మైనర్లు వాహనాలు నడుపుట చట్టరీత్యా నేరం. యఎస్ ఐ.పి.చౌడయ్య. 

మైనర్లు వాహనాలు నడుపుట చట్టరీత్యా నేరం. యఎస్ ఐ.పి.చౌడయ్య.

 

యర్రగొండపాలెం,అఖండ భూమి

:ఇంటర్మీడియట్ పరీక్షల జరుగుతున్న నేపథ్యంలో మైనర్ విద్యార్థులు హడావుడిగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోని ఎస్సై పి చౌడయ్య వాహనాల తనిఖీలు చేపట్టారు.జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పట్టణంలోని ఆర్ అండ్ బి బంగ్లా వద్ద సోమవారం విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు.ద్విచక్ర వాహనాలు నడుపుతున్న

మైనర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు.పరీక్షలకు వెళ్లాలనే తొందరపాటుగా పరీక్ష అయిపోయిందనే సంతోషంలో వాహనాలు నడిపి ప్రమాదాలు కొని తెచుకోవద్దని సూచించారు.పెద్దవారు నడిపే వాహనాలపై మాత్రమే పరీక్ష సమయానికి ముందుగానే కేంద్రాలకు వెళ్లాలని చెప్పారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మైనర్లు వాహనాలు నడపటం చట్టరీత్యా నేరమని,అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని అన్నారు.18 సంవత్సరాల కంటే తక్కువ వయసులో వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని,ప్రమాణాలకు దారితీసే ఆవకాశం ఎక్కువగా ఉంటుందని వివరించారు.తల్లి దండ్రులు తమ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.చిన్నారులు వాహనాలు నడపకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు.అవగాహనా లేకుండా వాహనం చేతిలో ఉందని అతివేగంగా మైనర్లు

నడపడం వల్ల వారితో పాటు ఎదుటి వారికి కూడా ప్రమాదాలు జరుగుతా యని అన్నారు.పిల్లలకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులు మీద కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఇక నుండి మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుపడితే వాహనాలు స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని చెప్పారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు.నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపిన వారికి జరిమానాలు విధించారు.ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు.ద్విచక్రవా హనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు.నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతున్న వ్యక్తులతో పాటు సరైన దృవీకరణ పత్రాలు లేకుండా ప్రయాణిస్తున్న వివిధ సెక్షన్ ల కింద 20 మంది వాహనదారులకు జరిమానాలు విధించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!