రామునికి రాక్షసులకు మధ్య జరుగుతున్న యుద్ధం…
*రేవంత్ రెడ్డి నీ ఓడించినందుకే కామారెడ్డి ప్రజలపై కక్ష కట్టారు..
*కొడంగల్ కి నిధులు కామారెడ్డి కి గొడవలు..
*కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు..
*బీజేపీ తోనే తెలంగాణ అధివృద్ధి సాధ్యం..
*ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 24 ( అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి కి ప్రయత్నించిన నేపథ్యంలో గత మూడు రోజులు గృహనిర్బంధంలో ఉన్న కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి కి మద్దతుగా ఆర్మూర్ శాసన సభ్యులు రాకేష్ రెడ్డి మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంకు వచ్చి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. క్యాంపు కార్యాలయంపై దాడులు అన్యాయం, అక్రమం అని ఖండించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం షబ్బీర్ అలీ నీ అద్దం పెట్టుకొని ఫ్రోటోకాల్ పాటించడం లేదు ఇకపై యుద్ధమే ఉంటుంది. అది రామునికి రాక్షసులకు మధ్య జరుగుతున్న యుద్ధం అని అన్నారు. రేవంత్ రెడ్డి నీ ఓడించినందుకే కామారెడ్డి ప్రజలపై కక్ష కట్టారనీ అన్నారు. కొడంగల్ కి నిధులు తీసుకెళ్తున్న రేవంత్ రెడ్డి కామారెడ్డి కి గొడవలు తెస్తున్నారని అన్నారు. బీజేపీ తోనే తెలంగాణ అధివృద్ధి సాధ్యం అని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయమే గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి, బిజెపి నాయకులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


