కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు వివరాల పై కలెక్టర్ , శ్వేత పత్రం విడుదల చెయ్యాలి .
..
ఏబీవీపీ రాష్ట్రం నాయకుడు వరుణ్..
ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు రక్షిస్తూ కబ్జా కారుల పై కట్టిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 24 (అఖండ భూమి న్యూస్);
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కామారెడ్డి నగర శాఖ ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం మంగళవారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎబివిపి రాష్ట్ర నాయకులు చరణ్ మాట్లాడుతూ 1964 లో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అందించిన 264 ఎకరాల 4 గుంటల భూమిని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు ఎన్ని ఎకరాలు కేటాయించారో సర్వే నంబర్లో తో సహా వాటి భూముల వివరాలను ప్రభుత్వ అధికారులు మీడియా సాక్షిగా ప్రజలకు తెలియజేయాలి అని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మీకు విన్నవిస్తుంది. అలాగే ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పేరు పైన రిజిస్ట్రేషన్ అయిన భూమి వివరాలు మ్యాప్ తో సహా మొత్తం 264 ఎకరాల 4 గుంటల భూమి యొక్క పూర్తి వివరాలు మీరు మీడియా సాక్షిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.2021 లొ చేపట్టిన కళాశాల భూముల సర్వే వివరాలను ప్రజా క్షేత్రంలో ఉంచాలని, అలాగే అక్రమంగా కళాశాల భూమిని కబ్జా చేసిన వారి పై కట్టిన చర్యలు తీసుకోవాలని, కబ్జాదారుల కోరల నుండి కళాశాల భూమిని కాపాడాలని ఎబివిపి డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి సంజయ్ , కార్యకర్తలు పవన్,విష్ణు,చరణ్,రాకేష్,భారత్, సిద్ధు, విద్యార్థులు పాల్గొన్నారు.
You may also like
రామునికి రాక్షసులకు మధ్య జరుగుతున్న యుద్ధం…
ఉద్యోగుల ఆరోగ్య కార్డులు – ఈ హెచ్ ఎస్ ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన ఉద్యోగులు…
అంబారీపేట సర్పంచ్ పరుట్ల కవిత అనిల్ రేణుక , జమదగ్నిల కళ్యాణం కు పట్టు వస్త్రాలు పుస్తే మట్టెలు అందజేత… …
కామారెడ్డి జిల్లా డిఎంహెచ్వో గా రవీందర్ గౌడ్ బాధ్యతలు స్వీకరణ…
విజయ్ దేవరకొండ, రష్మిక మందన వివాహ విందుకి ఆహ్వానించిన హీరో ఆనంద్ దేవరకొండ…


