ఉద్యోగుల ఆరోగ్య కార్డులు – ఈ హెచ్ ఎస్ ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన ఉద్యోగులు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 24 (అఖండ భూమి న్యూస్);
ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు , తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరు మార్చి డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ గా మారుస్తూ, ఉద్యోగులకు ఇచ్చేందుకు అంగీకరించిన రేవంత్ రెడ్డి మంగళవారం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
1.20 కోట్ల ప్రమాద బీమా.
60 సంవత్సరాల లోపు సహజ మరణం చెందితే 10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ మంజూరు జేయడం లాంటి రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న సందర్భంగా తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, కార్మిక, ఉపాధ్యాయుల, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, ఎస్.ఏం.హుస్సేనీ ముజీభ్ ఉప సెక్రటరీ జనరల్ & జి.ఎస్. టిఎన్జీవోఎస్ సెంట్రల్ యూనియన్ కు టి జి ఈ జేఏసీ కామారెడ్డి తరఫున ,కామారెడ్డి జిల్లా చైర్మన్ వెంకటరెడ్డి , సెక్రటరీ జనరల్ డాక్టర్ దేవేందర్ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
గతం లో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యగులను ప్రపంచ బ్యాంకు షరతులు అంగీకరించి నాటి ప్రభుత్వం వైద్య విధాన పరిషత్ ఏర్పాటు చేసి ఎంతో మంది ఉద్యోగులను మానసిక ఒత్తిడి కి గురిచేసిందని వైద్యవిధాన పరిషత్ ఉద్యగులకు నెలనాడు జీతాలు రాక అలాగే ప్రభుత్వం నుండి లభించే ఎలాంటి సౌకర్యాలు లభించేవి కావని వారి సమస్యల పరిష్కారానికి టి జి ఈ జెఎసి తరుపున ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చామని ఈ ప్రజాప్రభుత్వం 12500 మంది ఉద్యోగస్తులకు అలాగే 200 హాస్పిటల్స్ ఒక గొప్పవరం ఇక నుండి వారికి 010 పద్దు కింద నెలసరి జీతభత్యాలు మరియు ఇతర ప్రయోజనాలు పొందుతారని అలాగే వైద్యవిధాన పరిషత్ లో పనిచేసే స్టాఫ్ నర్స్ లకు నర్సింగ్ ట్యూటర్ గా వెళ్ళే అవకాశం లభిస్తుందని ఇది టి జి ఈ , జేఏసీ సంఘాల ఐక్యాతకు నిదర్శనమని వారు ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, కార్మిక, ఉపాధ్యాయుల, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ బాగస్వామ్యాసoగాలా నిరంతర కృషి వల్ల ఉద్యోగుల ఆరోగ్య కార్డులు (ఈ హెచ్ ఎస్) మరియు వైద్య విభాగం 010 పద్దుక్రింద జీతాలు తిసూకునే ప్రక్రియా సాద్యమైంది.
అలాగే భవిష్యతులో కూడ ప్రధాన డిమాండ్‌లైనా పి ఆర్ సి కి వచ్చే బడ్జెలో కేటాయించాలని మరియు సిపిఎస్, పెండింగ్ బిల్లులను నేలకు 700 కోట్ల నూండి 1500 కోట్లకు పెంచాలని ఐక్యాంగా ఉండి హక్కులను సాదించుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేశారు
ఇట్టి కార్యక్రమంలో టి జి ఈ, జేఏసీ కామా రెడ్డి జిల్లా చైర్మన్ నరాల వెంకటరెడ్డి, సెక్రెటరీ జనరల్ డాక్టర్ దేవేందర్,కార్యదర్శి చింతల లింగం, గోవర్ధన్, దేవరాజు, శివకుమార్, రాజేశ్వర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
రామునికి రాక్షసులకు మధ్య జరుగుతున్న యుద్ధం…
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు వివరాల పై కలెక్టర్ , శ్వేత పత్రం విడుదల చెయ్యాలి .
అంబారీపేట సర్పంచ్ పరుట్ల కవిత అనిల్ రేణుక , జమదగ్నిల కళ్యాణం కు పట్టు వస్త్రాలు పుస్తే మట్టెలు అందజేత… …
కామారెడ్డి జిల్లా డిఎంహెచ్వో గా రవీందర్ గౌడ్ బాధ్యతలు స్వీకరణ…
విజయ్ దేవరకొండ, రష్మిక మందన వివాహ విందుకి ఆహ్వానించిన హీరో ఆనంద్ దేవరకొండ…


