ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ అబ్ఆపనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 25 (ఆ పాండా భూమి న్యూస్);
జిల్లాలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. బుధవారం రాజం పేట మండలం కొండాపూర్ లో లబ్ధిదారులు నిర్మించుకుంటున్న సంబంధిత గ్రామాన్ని సందర్శించి నిర్మాణంలో ఉన్న ఇళ్ల పనుల తీరును సమీక్షించారు.
ఈ సందర్భంగా ఇంటిని నిర్మించుకుంటున్న లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని నాణ్యమైన నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఇళ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేసి, నిర్ణీత గడువులోగా లబ్ధిదారులకు గృహప్రవేశం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా పనులు నిర్వహించాలని స్పష్టం చేశారు. అవసరమైన నిర్మాణ సామగ్రి, సాంకేతిక సహాయం లభ్యమయ్యేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.
కలెక్టర్ వెంట పిడి హౌసింగ్ విజయపాల్ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


