ప్లాస్టిక్ నివారించడమే భవిష్యత్ తరాలు సైతం ముందుండాలి…

*ప్లాస్టిక్ నివారించడమే భవిష్యత్ తరాలు సైతం ముందుండాలి…

శ్రీ సరస్వతీ విద్యాలయం ప్రదర్శన భేష్..

దోమకొండ సర్పంచ్. ఐరిని నర్సయ్య

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 27 (అఖండ భూమి న్యూస్);

ప్లాస్టిక్ నివారణ గేయంగా రారున్న భవిష్యత్ తరాలకు ప్లాస్టిక్ నిషేధించడమే ధ్యేయంగా పనిచేయాలని దోమకొండ సర్పంచ్ ఐరేని నరసయ్య అన్నారు.

* ప్లాస్టిక్ అనర్థాలను శుక్రవారం వివరిస్తూ శ్రీ సరస్వతీ విద్యాలయం విద్యార్థులు ఇచ్చిన ప్రదర్శన చాలా బాగుందని అన్నారు. దోమకొండ మండల కేంద్రం లో శుక్రవారం గ్రామ పంచాయతీ భవనం ముందు చౌరస్తా లో శ్రీ సరస్వతీ విద్యాలయం విద్యార్థులు ప్లాస్టిక్ నివారణ పై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. నృత్య ప్రదర్శన ద్వారా ప్లాస్టిక్ వల్ల వచ్చే సమస్యలు, వ్యాధులను తమ ప్రదర్శన లో చాలా చక్కగా వివరించారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అథితి గా ఆయన హాజరై మాట్లాడుతూ…. ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మాణం లో విద్యార్థులు, ప్రజలది ప్రధాన పాత్ర అన్నారు. ఒక్కసారే వాడి పడేసే ప్లాస్టిక్ ను పూర్తిగా నివారించాలన్నారు. ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు వాడొద్దన్నారు.ప్లాస్టిక్ వాట్లిలో వేడి వస్తువులు పోయటం వల్ల అది విషపూరితం అవుతుందన్నారు. కాన్సర్ లాంటి మహమ్మారి వ్యాధుల పాలయ్యే అవకాశం ఉంద న్నారు.కూరగాయల మార్కెట్ వెళ్లేప్పుడు బట్ట సంచులను, నాన్వెజ్ మార్కెట్ వెళ్లేప్పుడు స్టీల్ బాక్స్ లు ఉపయోగించాలన్నారు. తమ వంతు బాధ్యత గా పాఠశాల వారు ఇలాంటి అవగాహన కార్యక్రమాన్ని ఎంచుకోవడం అభినందనీయం అన్నారు.ప్లాస్టిక్ నివారణ పై త్వరలో దోమకొండ లోని వ్యాపారస్తులతో ఒక సమావేశం నిర్వహిస్తామన్నారు. ఉపసర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, కరెస్పాండంట్ మధుసూదన్ జోషి, గ్రామ కార్యదర్శి, వార్డ్ సభ్యలు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు..

Akhand Bhoomi News

error: Content is protected !!