దోమకొండ జిపి పాలకవర్గం ప్రమాణ స్వీకారం కు లక్ష 38 వేల రూపాయల ఖర్చుపై గ్రామ సభలో రభస…

దోమకొండ జిపి పాలకవర్గం ప్రమాణ స్వీకారం కు లక్ష 38 వేల రూపాయల ఖర్చుపై గ్రామ సభలో రభస…

ప్రమాణ స్వీకారానికి అధిక నిధులు వాడడం పై గ్రామ సభలో అభ్యంతరాలు..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 28 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో శనివారం దోమకొండ గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి అధిక ఖర్చుల పై రెండు వర్గాల మధ్య కొద్దిసేపు రభస చోటు చేసుకుంది. దోమకొండ నూతన పంచాయతీ పాలకవర్గం ప్రతిసారి గ్రామపంచాయతీలోనే ప్రమాణస్వీకారం చేసేవారని, గ్రామపంచాయతీలో కాకుండా ఫంక్షన్ హాల్లో నిర్వహించి జిపి పాలకవర్గం అత్యధిక ఖర్చులు చేయడంపై సర్పంచి ఐరేని నరసయ్యను దోమకొండ గ్రామానికి చెందిన మద్దూరి భూపాల్ రెడ్డి, తిప్పపురం రవిలు ఈ విషయాన్ని లేవనెత్తారు. మాట మాట పెరిగి చిన్నపాటి వివాదం చోటుచేసుకుంది. గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు చేసే నిధులను ప్రమాణ స్వీకారానికి అత్యధికంగా పాలకవర్గం ఖర్చు చేయడం ఏంటని సర్పంచ్ తో పాటు పంచాయతీ కార్యదర్శి యాదగిరిని ప్రశ్నించారు. ఈ మొత్తం నిధులు ప్రమాణ స్వీకారానికి కాకుండా ఊర పండగ సమయంలో కొన్ని వీధిలైట్లు అమర్చినట్లు తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో ప్రమాణ స్వీకారానికి, ఇతర పనులకు ఎన్ని డబ్బులు ఖర్చు చేశారో పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడించాలని పట్టుపట్టారు. దీంతో సభలో ఇరువర్గాల మధ్య మాటలు జరిగాయి. దోమకొండకు ఎన్ని నిధులు కామారెడ్డి ఎమ్మెల్యే ఏం అభివృద్ధి చేశారని సర్పంచ్ నరసయ్య అనడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో గ్రామస్తులు ఇరువర్గాలను సముదాయించి భవిష్యత్తులో గ్రామ అభివృద్ధికి అందరు సహకారంతో నూతన పాలకవర్గం మార్గదర్శకంగా నిలిచి అభివృద్ధిలో ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో నూతన జిపి పాలక వర్గంతో పాటు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!