ఉగాది ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీశైలం మహా క్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనార్థం విచ్చేయు కన్నడ భక్తులకు శివోహం టెంపుల్ ట్రస్ట్ అన్నదాన ప్రసాద,వితరణ,కార్యక్రమం

శ్రీశైలం అఖండ భూమి న్యూస్ మార్చి 19
శ్రీశైల మహా క్షేత్రము ఉగాది పురస్కరించుకొని ఈ,సందర్భంగా శ్రీ భ్రమరాంబ అమ్మవారిని కర్ణాటక రాష్ట్ర భక్తులకు శ్రీ భ్రమరాంబ దేవి వారి నీ,ఆడపడుచు గా ప్రతి సంవత్సరము ఉగాది పండగకు 15 రోజుల ముందు నుండి నడక ప్రారంభం చేసి ఉగాది ఉత్సవాలకు ఐదు రోజుల ముందు భక్తి శ్రద్ధలతో కర్ణాటక రాష్ట్రం నుండిపాదయాత్ర తో శ్రీశైలం చేరుకొని, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారికి వారి మొక్కులు సమర్పించుకొని వెళ్లేటువంటి భక్తులకు సుమారుగా వారం రోజుల నుండి నడకదారి భక్తులకు ఉచితముగా వసతులు, సేద తీర్చుకొనుటకు ఏర్పాట్లు చేసి, నిరంతరము ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభం చేసి, రాత్రి 10 గంటల 30 నిమిషాల వరకు, ప్రతినిత్యము ఉదయము అల్పాహారం , మరియు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, సాయంత్రము అల్పాహారము మరియు , ఉదయము సాయంత్రము తేనీరు, కన్నడ సేవకులతో శ్రీ అన్నపూర్ణాదేవి సమేత సనారీ విశ్వేశ్వర స్వామి వార్ల అనుగ్రహంతో,
శ్రీ తిరుపతి నాయన రమణమ్మ అమ్మవార్ల స్ఫూర్తితో, శివోహం టెంపుల్ ట్రస్ట్ నిర్వాహకులు మరియు అన్నపూర్ణాదేవి కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని అఖండ అన్నదానముగా ఏర్పాటుచేసి, ప్రతినిత్యము వివిధ రకాల రుచులను అందిస్తూ…! కన్నడ భక్తుల మనసుని దోచుకున్న ట్రస్టు నిర్వాహకులు అంతిరెడ్డి అరవింద్ రెడ్డి మరియు వారి ఆశ్రమ శిష్య బృందము మరియు సేవకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతోంది,
ఉగాది శుభ సందర్భంగా బక్ష, భోజ్య పరమాన్నములు వాటికి అనుసంధానమైనటువంటి తినుబండారాలు, ఏర్పాటుచేసి, కన్నడ భక్తులకు పండగ వాతావరణం చూపించి తృప్తి పరిచినటువంటి శివోహం టెంపుల్ ట్రస్ట్ నిర్వాహకులు.
13వ తేదీ మొదలుకొని 20వ తేదీ వరకు ఈ మహా అన్న ప్రసాద,వితరణ కార్యక్రమం ఉంటుందని తెలియజేయడం జరుగుతోందని శివ హోమ్ టెంపుల్ ట్రస్ట్ నిర్వాహకులు అంతి రెడ్డి అరవింద రెడ్డి దేవాదాయ, ధర్మాదాయ, శాఖ హిందూ,ధర్మ పరిరక్షణ , ట్రస్ట్, కోఆర్డినేటర్ నరేంద్ర మోడీ విచార్ మంచు జోనల్అధ్యక్షులు అంతిరెడ్డి అరవింద్ రెడ్డి తెలిపారు,,,,


