కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా వేముల కృష్ణ నియామకం
బెల్లంపల్లి మార్చి20(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కాసిపేట మండలంలోని సోమగూడెం గ్రామానికి చెందిన వేముల కృష్ణ నియమితులయ్యారు.విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా కృషి చేస్తూ,దశల వారీగా పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వేముల కృష్ణ పనితనాన్ని గుర్తించి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమానికి కృషి చేసిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,మాజీ డీసీసీ అధ్యక్షులు సురేఖమ్మ,బెల్లంపల్లి శాసన సభ్యులు గడ్డం వినోద్,జిల్లా పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి లకు ఆదాని సిమెంట్ కంపెనీ కార్మిక యూనియన్ అధ్యక్షుడు సత్యపాల్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.అలాగే రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా,
ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ముందుకు సాగుతామని చెప్పారు.
రాజకీయ ప్రస్థానం*: పార్టీ పదవులు..
1995లో కాంగ్రెస్ పార్టీలో మొదలైన అయన ప్రస్థానం 1997లో కాసిపేట మండల ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా విద్యార్థి విభాగంలో అయన ఉనికిని తెలుపుకున్నారు…2001లో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎన్ ఎస్ యూ ఐ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి 2003 నుండి దాదాపు 5 సంవత్సరాలు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా 2008 నుండి మూడు సంవత్సరాలు యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా 2011లో యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికలల్లో విజయo సాధించారు…2014లో ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శిగా,2017లో కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా కార్యదర్శిగా అలాగే 2019లో జరిగిన సర్పంచ్ ఎన్నికలల్లో పెద్ధనపల్లి సర్పంచ్ గా భారీ మెజారిటీతో విజయం సాధించారు…2022లో కాసిపేట మండల అధ్యక్షుడిగా సేవలు అందిస్తూ,అలాగే 2021 లో బోథ్ అసెంబ్లీ ఎల్ డీ ఎం కో ఆర్డినేటర్గా 2024లో మంచిర్యాల నియోజకవర్గ కో ఆర్డినేటర్ గా ఎనలేని సేవలు కాంగ్రెస్ పార్టీకి అందిస్తూ ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ఎంత ఇబ్బందులు పడ్డా తట్టుకొని నిలబడి మండలంలో కాంగ్రెస్ పార్టీనీ నిలబెట్టిన నాయకుడు వేముల కృష్ణ….ఎంతో మంది తమ అవకాశాలకోసం పార్టీలు మారినా,
అయన ఎన్ని ఇబ్బందులు,
ప్రలోభాలకు తలొగ్గకుండా కాంగ్రెస్ పార్టీ అంటే వేముల కృష్ణ,వేముల కృష్ణ అంటే కాంగ్రెస్ పార్టీ అనేలాగ గుర్తింపు తెచ్చుకున్నారు…



