బంజారా సమస్యల శాశ్వత పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం…

బంజారా సమస్యల శాశ్వత పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం…

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మార్చి 7 (అఖండ భూమి న్యూస్)

బంజారా సమస్యలకు శాశ్వత పరిష్కారంతోపాటు వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. శనివారం శ్రీకాంత్ సేవాలాల్ మహారాజులు 2008వ జయంతి ఉత్సవాల్లో పాల్గొని సందర్భంగా మాట్లాడారు.

ఎస్సీ, ఎస్టీ, బిసి , మైనారిటీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని, గిరిజన సోదరీమణులతో కలిసి నృత్యం చేసి వారిలో ఒకరిగా కలిసిపోయారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ .

బంజారా భవన్ , స్థల సమస్యల పరిష్కారం చేస్తాను అన్నారు.

ప్రభుత్వం తరపున బంజారా భవన్ నిర్మాణం కోసం ఇప్పటికే ఒక ఎకరం స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఈ స్థలానికి సంబంధించి ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతర అడ్డంకులు ఉంటే, వాటన్నింటినీ స్వయంగా పర్యవేక్షించి త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను అని అన్నారు.

 

అంతేకాకుండా, ఈ భవనానికి రక్షణగా అవసరమయ్యే ప్రహరీ గోడ నిర్మాణానికి నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను. అన్నారు

 

“నాకు ఆధ్యాత్మిక గురువులు రామారావు మహారాజ్ తో ఎంతో కాలంగా మంచి అనుబంధం ఉంది. వారిపై ఉన్న గౌరవంతోనే ఈరోజు వారి మనుమడితో కూడా అదే రీతిలో సంబంధ బాంధవ్యాలను కొనసాగిస్తున్నాను అని అన్నారు. బంజారా సమాజంతో నాకున్నది కేవలం రాజకీయ సంబంధం కాదు, అది ఒక కుటుంబ అనుబంధం. అని గుర్తు చేశారు.

మీ సమస్యలకు నేనున్నాననే భరోసా

“ముఖ్యమంత్రి నన్ను ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విభాగాల సలహాదారుగా నియమించారు అని అన్నారు. గిరిజన బిడ్డలైన మీ సమస్యలు ఏవైనా నా దృష్టికి తీసుకురండి. మీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుండి లభించాల్సిన ప్రతి సాయాన్ని మీకు అందేలా చూస్తాను అని అన్నారు.

నా శక్తి వంచన లేకుండా మీ సంక్షేమం కోసం కృషి చేస్తానని మాట ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖులు

మాజీఎమ్మెల్సీ: రాములు నాయక్ ,

నాయకులు: మల్లికార్జున్ (డిసిసి అధ్యక్షులు), కైలా శ్రీనివాసరావు (మాజీ డిసిసి అధ్యక్షులు)

ప్రజా ప్రతినిధులు: చంద్రకాంత్ రెడ్డి (గ్రంధాలయ చైర్మన్), చంద్రకరణ్ రెడ్డి (పిసిసి జనరల్ సెక్రెటరీ)

స్థానిక నేతలు: ఉమా శ్రీనివాస్ (మున్సిపల్ చైర్మన్), ఐరేని సందీప్, గూడెం శ్రీనివాస్ రెడ్డి, భీమ్ రెడ్డి, గణేష్ నాయక్, మోతిలాల్, నవసిలాల్ నాయక్, సధనాయక్ మరియు ఇతర కాంగ్రెస్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!