దోమకొండ ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గం త్వరలో ఏర్పాటు..!
కామారెడ్డి నియోజకవర్గంలో రెండుగా చీలనున్న కామారెడ్డి, దోమకొండ నియోజకవర్గాలు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మార్చి 23 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి నియోజకవర్గం రెండు నియోజకవర్గాలుగా చీలిపోయి కామారెడ్డి, దోమకొండ నియోజకవర్గం ఏర్పాటు కానున్నట్లు అత్యంత సన్నిహిత ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. కామారెడ్డి నియోజకవర్గంలోని కామారెడ్డి నియోజకవర్గంలో దోమకొండ, భిక్కనూర్, మాచారెడ్డి, రాజంపేట, పాల్వంచ, బీబీపేట్ మండలాలు గా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 2029 ఎన్నికలకు 178 అసెంబ్లీ సీట్లుగా రాష్ట్రవ్యాప్తంగా పెరుగనుండడంతో కామారెడ్డి జిల్లాలో కేవలం నాలుగు నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం జనాభా , అధిక ఓటర్లను దృష్టిలో ఉంచుకొని కామారెడ్డి జిల్లాలోని అత్యధిక జనాభా, ఓటర్లు ఉన్న దోమకొండ మేజర్ గ్రామపంచాయతీ, పాట తాలూకా, సబ్ డివిజన్ గా కొనసాగుతున్న దోమకొండను కొత్త నియోజకవర్గంగా ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు మొదలైనట్లు తెలిసింది. కామారెడ్డి పట్టణంతోపాటు తాడ్వాయి, సదాశివ నగర్, రామారెడ్డి మండలాలను కలుపుకొని కామారెడ్డి నియోజకవర్గంగా, దోమకొండ, భిక్కనూర్, రాజంపేట, పాల్వంచ, మాచారెడ్డి, బీవీ పేట మండలాలను కలిపి దోమకొండను ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



