జిల్లా కాంగ్రెస్ నాయకులను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి;!మర్చి 25 (అఖండ భూమి న్యూస్)
దోమకొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ నాయకులను బుధవారం సన్మానించారు. దోమకొండ మండలంకు చెందిన వారికి ఉన్నత పదవులు రావడం పట్ల మండల పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం నాడు దోమకొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ జెడ్పిటిసి సభ్యుడు తీగల తిరుమల గౌడ్, సీనియర్ కాంగ్రెస్ జిల్లా నాయకుడు అబ్రబోయిన స్వామి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గా తాటిపల్లి శ్రీకాంత్, ఉపాధ్యక్షులుగా ఎంపికైన ఐరెని నరసయ్య. జిల్లా ప్రధాన కాంగ్రెస్ కార్యదర్శిగా ఎంపికైన జిల్లా కార్యదర్శిగా ఎంపికైన ముత్యంపేట సర్పంచ్ ఆశ బోయిన శ్రీనివాస్. నత్తి సంజీవులను పలువురు కాంగ్రెస్ నాయకులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం వారికి మిఠాయి తినిపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సీతారాం మధు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. మండల కాంగ్రెస్ నాయకులు నల్లపు శ్రీనివాస్. మర్రి శేఖర్. డైరెక్టర్లు గోపాల్ రెడ్డి, అబ్రబోయిన రాజేందర్, సాయిలు. నర్సింలు. బత్తిని సిద్ధ రాములు. డైరెక్టర్ నరసింహులు. నరేష్ రెడ్డి. సిద్ధారెడ్డి. శమీ. నయీమ్. ఖలీమ్. అబ్రబోయిన రాజు. గొట్టిముక్కల మధు. బాలరాజ్. తో పాటు పలువురు శాలువాలు కప్పి సన్మానించారు.



