బెల్లంపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవయవ,నేత్ర,శరీర దానం పై అవగాహనా ర్యాలీ

నేత్రదానం చేసేందుకు ముందుకు వచ్చి ఆదర్శంగా నిలిచిన బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి-రమేష్ బాబు దంపతులు
జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకట స్వామి.
బెల్లంపల్లి మార్చి 26(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ పురపాలక సంఘం ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ,పోలీసు శాఖ,వైద్య ఆరోగ్య శాఖ,ప్రజా సంఘాలు,స్వచ్చంద సంస్థలు,మీడియా మిత్రులు బెల్లంపల్లి ప్రజల సహకారంతో గురువారం అవయవ,నేత్ర,శరీర భాగాల దానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ర్యాలీకీ ముఖ్య అతిధిగా బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకట స్వామి,మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి-రమేష్ బాబు,వైస్ చైర్మన్ రాగంశెట్టి సతీష్,మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి.ఈ కార్యక్రమాన్ని
బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయం నుంచి మొదలైన ఈ ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది.ఈ దందర్బంగా జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో నేత్రదానం చేసేందుకు బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి-రమేష్ బాబు దంపతులు ముందుకు వచ్చి అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు.ఈ ఈ సందర్బంగా
వారు మాట్లాడుతూ..సమాజం నుంచి అంధత్వాన్ని పారద్రోలేందుకు ప్రతి ఒక్కరు తమవంతుగా స్వచ్ఛందంగా నేత్ర దానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి యువకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు…
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


