దోమకొండకు మాజీ మంత్రి షబ్బీర్ అలీ రాక…
దోమకొండ పట్టణ అధ్యక్షుడు సీతారాం మధు ముదిరాజ్. 
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 1 (అఖండ భూమి న్యూస్);
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రణాళికకు హాజరవుతున్న కామారెడ్డి ముద్దుబిడ్డ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు షబ్బీర్ అలీ దోమకొండ లోని ప్రభుత్వ ఆసుపత్రి 50 పడకల ఆస్పత్రిగా మారుస్తూ స్థలం పరిశీలించడానికి దోమకొండ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో గురువారం ఉదయం 11 గంటలకు దోమకొండ సర్పంచ్ ఐరేని నరసన్న అధ్యక్షతన నిర్వహించే ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమానికి పలు అభివృద్ధి కార్యక్రమాలకు వస్తున్నట్లు దోమకొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం మధు ముదిరాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దోమకొండ లోని సీసీ రోడ్లు మహిళా సంఘ భవనం ప్రారంభం చేస్తారని ఈ కార్యక్రమానికి దోమకొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు , డ్వాక్రా సంఘం సభ్యులు , ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు , గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని ప్రకటనలో పేర్కొన్నారు.


