కేపీ రాజారెడ్డి జనసేవా ట్రస్ట్ సారాధ్యంలో పంపిణీకి సిద్ధంగా 6 వేల డిస్కు బెంచీలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 1 (అఖండ భూమి న్యూస్);
*కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో కె.పి రాజారెడ్డి జనసేవా ట్రస్ట్ సారధ్యంలో కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోనీ అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం 6000 డెస్క్ బెంచీలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ. కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల, కేజీబీవీ బాలికల పాఠశాలలో, సాంఘిక సంక్షేమ పాఠశాల ఇలా అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో 1 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు చదువుతున్న ప్రతి విద్యార్ణి కి సౌకర్యవంతంగా ఉండేందుకు, నాణ్యమైన విద్య అందించే ఉద్దేశంతో , పైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యార్థుల సంఖ్య పెరగాలనే ఉద్దేశంతో ట్రస్టు ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి కె.పి రాజారెడ్డి జనసేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 18.000 మంది విద్యార్థిని విద్యార్థుల కోసం సుమారు 4 కోట్ల రూపాయల వ్యయం 6000 డ్యూయల్ డెస్క్ లు పంపిణీకి సిద్ధం చేశారని అన్నారు. ఈ నెల 4వ తేదీ నుండి విద్యార్థుల సంఖ్య ఆధారంగా స్వయంగా పాఠశాలకు అందించడం జరుగుతుందని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి *గౌరవ శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలకు అనేక మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.


