యూనివర్సిటీ లలో పర్యావరణ హిత పరిశోధనలు జరగాలి…
డా.చంద్రశేఖర్, ఐ ఐ సి టి మాజీ డైరెక్టర్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 1 (అఖండ భూమి న్యూస్);
వాతావరణాన్ని కలుషితం చెయ్యకుండా, భూమిని కాపాడుతూ సైన్స్ పరిశోధనలు జరగాలని, నూతన ఆవిష్కరణలు చెయ్యాలని IICT మాజీ డైరెక్టర్, శాస్త్రవేత్త డా.శ్రీవారి చంద్రశేఖర్ అన్నారు. మన భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని,భూమిని అందివ్వాలని పిలుపునిచ్చారు. సైన్స్,ఫార్మా రంగం అభివృద్ధి ద్వారా మనిషి జీవిత కాలాన్ని పెంచుకున్నామని అన్నారు. మానవుడు స్వార్థ జీవిగా కాకుండా సమాజం గురించి ఆలోచించాలని అన్నారు. రసాయన శాస్త్రం మిగతా సైన్స్ ల లాగా మామూలుగా నిరూపించేది కాదని , ఖచ్చితంగా అనలిటికల్ టెక్నిక్స్ ఉపయోగించి నిరూపించాల్సిందే అన్నారు. అందుకే ఈ కార్యశాల విద్యార్థులకు ఉపయోగం అన్నారు. తాను కామారెడ్డి అల్లుడిని అని తన మూలాలను గుర్తు చేసుకున్నారు.
సఫల ఆర్గానిక్స్ సీ.ఈ.ఓ.పైడి ఎల్లారెడ్డి గారు మాట్లాడుతూ భిక్నూర్ క్యాంపస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగానికి ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. ఇక్కడి వాతావరణం విద్యార్థులు చదువుకోవడానికి అనుగుణంగా ఉందని అన్నారు. ఈ కార్యశాలకు అకాడమిక్ ప్రొఫెసర్ లతో పాటు, ఇండస్ట్రీ వర్గాలు కూడా పాల్గొనడం వల్ల విద్యార్థులకు మంచి జ్ఞానం అందుతుందని అన్నారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయని, సీరియస్ గా ఈ ఫీల్డ్ లో పనిచేయాలనుకున్న వాళ్లే ఇందులో చేరాలని అన్నారు. పీజీ పూర్తి కాగానే అనేక ఫార్మా సంస్థలు ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయని అన్నారు. కెమిస్ట్రీ మూలాల నుంచి నేర్చుకొని ఉద్యోగాలు అందిపుచుకోవాలని అన్నారు.
సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ డా. సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ కార్యశాల జరుపుతున్న కెమిస్ట్రీ విభాగానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యశాల విద్యార్థులకు మంచి ప్రాక్టికల్ జ్ఞానాన్ని అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యశాలకు అకాడమిక్ రంగం ,పరిశోధన రంగం మరియు ఇండస్ట్రీ నుంచి మూడు విభాగాలు ఇక్కడ హాజరయ్యారని,ఇది విద్యార్థులకు మంచి అవకాశం అని,వీలైనంత ఎక్కువ ఙ్ఞానాన్ని పొందాలని పిలుపునిచ్చారు.
మరో వక్త వి ఎల్ ఎన్ సాగర్ మాట్లాడుతూ క్రోమాటోగ్రాఫిక్ పద్ధతుల ద్వారా పరిశోధన అంశాల విశ్లేషణ గురించి వివరించారు.కార్యక్రమానికి ఆర్గనైజింగ్ సెక్రెటరీ డా.సునీత అధ్యక్షత వహించారు. కన్వీనర్ డా. సాయిలు కార్యశాల ఉద్దేశ్యాన్ని వివరించారు.
కార్యక్రమంలో కార్యశాల కో కన్వీనర్ డా.నాగరాజు,ఆర్గానిక్ కెమిస్ట్రీ అధ్యాపకులు డా.ఎ.నాగరాజు, డా.నిరంజన్ శర్మ,శ్రీకాంత్ ,డా.గంగా కిషన్,డా.డానియల్,డా.సురేష్,డా.నాగేశ్వర రావు APRO డా. సరిత పిట్ల,వివిధ విభాగాల అధ్యాపకులు డా.మోహన్ బాబు,డా.లలిత,డా.హరిత,డా.ప్రతిజ్ఞ,డా.నారాయణ,డా.రమాదేవి,వైశాలి,డా.శ్రీ మాత,డా.ఇంద్రకరణ్,డా.కనకయ్య,శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


