99 రోజుల కార్యాచరణ తో ప్రభుత్వ ప్రణాళిక అభివృద్ధికి దిక్సూచి…

99 రోజుల కార్యాచరణ తో ప్రభుత్వ ప్రణాళిక అభివృద్ధికి దిక్సూచి…

తెలంగాణ రాష్ట్రంలో 99 రోజుల కార్యాచరణకు దిక్సూచి..

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 2 (అఖండ భూమి న్యూస్);

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాప్రణాళిక కార్యచరణ ప్రణాళిక అందరికీ దిక్సూచిగా నిలిచి అభివృద్ధిలో దూసుకుపోతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. గురువారం

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభలో పాల్గొని సందర్భంగా మాట్లాడారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ మండల కేంద్రంలో ఈ సందర్భంగా గ్రామస్తులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక గురించి షబ్బీర్ అలీ వారికి అర్థమయ్యే తరహాలో వివరంగా ప్రజలకు తెలియజేశారు. ఈ ప్రణాళిక ద్వారా గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ఆరోగ్య సేవల మెరుగుదల, రహదారుల నిర్మాణం వంటి పలు రంగాల్లో వేగంగా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.

మండల అభివృద్ధిలో భాగంగా రూ.75 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు , ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ పనులు పూర్తయితే దోమకొండలో మౌలిక వసతులు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు.

గ్రామసభలో భాగంగా గ్రామస్తులు పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేయగా, కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ,

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, 99 రోజుల ప్రణాళిక ద్వారా ప్రతి గ్రామంలో అభివృద్ధి ఫలితాలు కనిపిస్తాయని అన్నారు. దోమకొండ మండలాన్ని ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేసి ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

నాడు ఇచ్చిన మాట ప్రకారం, ఇందిరమ్మ రాజ్యం లక్ష్యంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రజా సంక్షేమం కోసం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా మనం ప్రకటించిన “ఆరు గ్యారెంటీలను,చిత్తశుద్ధితో అమలు చేస్తూ, సామాన్యుడి ముఖంలో చిరునవ్వు చూడటమే ఈ ప్రభుత్వ ధ్యేయం అన్నారు.

మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాము. మరియు 500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తూ ఆడబిడ్డల ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నాము.

ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ, చీకటి గదుల్లో వెలుగులు నింపుతున్నాము అని అన్నారు.

సొంత ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నాము తెలిపారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వానికే ఉంటుందని అన్నారు.

వృద్ధులకు, వితంతువులకు ఇతర అర్హులైన లబ్ధిదారులకు, పెన్షన్ అందిస్తూ వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నామనీ అన్నారు.

రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా ఎకరాకు 12,000 రైతులకు కూడా ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నాము అన్నారు.

సంక్షేమమే కాకుండా, మౌలిక సదుపాయాల కల్పనలో మనం రాజీ పడటం లేదనీ రోడ్ల విస్తరణ, విద్యా సంస్థల బలోపేతం మరియు వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం జరుగుతుందన్నారు.

ముఖ్యంగా మన ప్రాంతంలో మెడికల్ కాలేజీల అభివృద్ధి , సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాము అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం. అవినీతి లేని పాలనను అందిస్తూ, ప్రతి కార్యకర్తను, ప్రతి పౌరుడిని భాగస్వాములను చేస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మధుమోహన్, గ్రామ సర్పంచ్ నరసయ్య,

తిరుమల గౌడ్, పాత రాజు, అనంతరెడ్డి,నర్సింగరావు, అబ్రబోయిన స్వామి, సీతారాం మధు ముదిరాజ్ సుతారి రమేష్, ఐరేణి సందీప్,పండ్ల రాజు, కారంగుల అశోక్ రెడ్డి, దేవరాజ గౌడ్,స్వామి, శ్రీనివాస్, శంకర్ రెడ్డి, శ్రీకాంత్ , పుల్ల బోయిన రమేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

దోమకొండ దేవుని కుంటలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణంకు భూమి పరిశీలన…

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ దోమకొండ మండల కేంద్రంలో సుమారు 22 కోట్లకు పైగా నిధులతో 50 పడకల ఆసుపత్రి నిర్మాణం కు అనువైన స్థలం ఉందని అన్నారు. ఈ స్థలంలోనే 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం కు గ్రామ పంచాయతీ తీర్మానం చేసి పత్రాలు అందించాలని ఆదేశించారు. మరో 10 రోజుల్లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజా నరసింహతో దేవుని కుంటలో ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. బస్టాండ్ ప్రాంతంలో ఉన్న 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రంను మదర్ & చిల్డ్రన్ కేర్ ఆస్పత్రిగా, ఇదే ప్రాంతంలో పోస్టుమార్టం నిర్వాహనకు అనుకూలంగా ఉందని ఆయన తెలిపారు. ఆస్పత్రి నిర్మాణం అనంతరం పూర్తిగా అందుబాటులోకి వస్తాయని అన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!