*అంబర్ పేటలో సర్పంచ్ అరుట్ల కవిత అనిల్ అధ్యక్షతన గ్రామసభ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 2 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబర్పేటలో గ్రామసభ గురువారం నిర్వహించారు. గ్రామ సభకు అధ్యక్షతన వహించిన సర్పంచ్ అరుట్ల కవిత అనిల్ , ప్రత్యేక అధికారిగా దోమకొండ మండల ఎంపీఓ రవికుమార్ గ్రామ కార్యదర్శి పద్మ,లు ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన, ప్రణాళికలను ప్రజలకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించారు. ఈ సమావేశంలో గ్రామంలోని పలు అభివృద్ధి పనులపై తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, సత్య గౌడ్, పాలకవర్గ సభ్యులు, గ్రామ వివిధ మహిళా డ్వాక్రా సంఘాల అధ్యక్షురాలు, గ్రామ ఏఈఓ మన్యుష, గ్రామ ఏఎన్ఎం డబేరో, గ్రామ లైన్మెన్ సిద్ధగిరి , ఫారెస్ట్ అధికారి ఎఫ్ బి ఓ పద్మ , గ్రామ రేషన్ డీలర్లు, ఆశ వర్కర్లు, అంగన్వాడి కేంద్ర టీచర్లు, స్థానిక SC కాలనీ ప్రైమరీ స్కూల్, జిల్లా పరిషత్, ప్రైమరీ స్కూల్ మరియు హై స్కూల్ హెడ్మాస్టర్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్ జి పి ఓ బాబు , గ్రామం యొక్క ప్రజాప్రతినిధులు, గ్రామ యువత, మరియు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు.
You may also like
గ్రామీణ ఆధ్యాత్మిక సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత…
పట్టణంలో అక్రమ, నిర్మాణ కట్టడాలపై చర్యలు తీసుకోవాలి…
కామారెడ్డిలో శాశ్వత తాగునీటి సమస్యకు పరిష్కారం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
బీబీపేట వాసవి క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే…
ఇసాయిపేటలో ఘనంగా గ్రామ దేవత మూర్తుల ప్రతిష్ట మహోత్సవ ఉత్సవాలు…


